Janaki V v/s State of Kerala Review : మలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో రూపొందిన కోర్ట్‌రూమ్ డ్రామా ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. జూన్ చివర్లోనే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ టైటిల్ లో ఉన్న సీతాదేవి మరోపేరు జానకి కాబట్టి, వివాదాస్పదం అవుతుందంటూ… పేరు మార్పుతో పాటు దాదాపు 96 కట్స్ చెప్పింది సెన్సార్ బోర్డ్. మూవీ టీమ్ దీనికి ఒప్పుకోలేదు. కానీ కోర్టుల చుట్టూ తిరిగాక చివరకు మేకర్స్ దిగివచ్చి ‘జానకి వర్సెస్ కేరళ’ నుంచి ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’కి మార్చి ఈరోజు రిలీజ్ చేశారు. మరి ఈ వివాదాస్పద మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథ
ఈ మలయాళ కోర్ట్‌రూమ్ డ్రామా జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) అనే ఐటీ ప్రొఫెషనల్ చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు నుండి కేరళలోని తన స్వస్థలానికి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వస్తుంది ఈ అమ్మాయి. కానీ ఒక దారుణమైన సంఘటన (అత్యాచారం) ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. తనకు జరిగిన అన్యాయానికి సైలెంట్ గా ఉండకుండా, దానికి కారణమైన పవర్ ఫుల్ వ్యక్తులపై ‘జానకి ఫైట్ ఫర్ జస్టిస్’ అంటూ న్యాయ పోరాటం మొదలెడితే, సిస్టమ్ ఆమెను టెస్ట్ చేస్తుంది. న్యాయవాది డేవిడ్ ఆబెల్ డోనోవన్ (సురేష్ గోపి) ఎంట్రీతో కథ ఊపు అందుకుంటుంది. ఈ లీగల్ బ్యాటిల్‌లో జానకికి న్యాయం జరుగుతుందా? లేక సిస్టమ్ ఆమె ధైర్యాన్ని బ్రేక్ చేస్తుందా? అసలు ఆమెపై అఘాయిత్యం చేసింది ఎవరు? వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది? అన్నది స్టోరీ.
విశ్లేషణ
మొదటి సగం కొంచం డ్రాగ్ అనిపిస్తుంది. బ్యాక్‌స్టోరీ సీన్స్ స్లో మోషన్లో సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కోర్ట్ సీన్స్ వచ్చేదాకా ఓపిక పట్టక తప్పదు. వచ్చాక మాత్రం కథ ఊపందుకుంటుంది. కోర్ట్ సీన్స్ నెక్స్ట్ లెవెల్. షార్ప్ డైలాగ్స్ , హై టెన్షన్, సస్పెన్స్ అదిరిపోతాయి. అలాగే సినిమాలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత, జ్యుడీషియల్ సిస్టమ్ లోపాలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. కానీ కొన్ని కోర్ట్ సీన్స్, క్లైమాక్స్ ప్రిడిక్టబుల్గా అనిపిస్తాయి. “ఈ సీన్ ఎక్కడో చూశామే” అనే ఫీల్ వస్తుంది.
ప్రవీణ్ నారాయణన్ కొత్త దర్శకుడు. ఆయన ఒక గ్రిప్పింగ్ కథను… అక్కడక్కడా కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఉద్వేగభరితమైన కోర్ట్‌రూమ్ సన్నివేశాలను బాగానే తెరకెక్కించారని చెప్పాలి. రెనాదివ్ సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ బీజీఎమ్ హైలెట్. సంజిత్ మొహమ్మద్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. సెకండ్ హాఫ్‌లో పేస్ సూపర్ ఫాస్ట్. CBFC వివాదం సినిమాకు ఎక్స్‌ట్రా హైప్ ఇచ్చినా, సినిమా మాత్రం ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. అయితే ఇదొక ఫ్రీ పబ్లిసిటీ స్టంట్ గా పని చేసింది.
అనుపమ పరమేశ్వరన్ జానకిగా అదరగొట్టింది. ఎమోషనల్ సీన్స్ లో గుండెలు పిండేసింది. అలాగే కోర్ట్‌రూమ్ సీన్స్‌లో ఫుల్ ఫైర్ చూపించింది. డేవిడ్‌గా సురేష్ గోపి స్క్రీన్ ప్రెజెన్స్ గూస్‌బంప్స్ గ్యారంటీ. శృతి రామచంద్రన్ (నివేదిత), షోబి తిలకన్ (సిఐ గోపకుమార్) సపోర్టింగ్ రోల్స్‌లో ఆకట్టుకున్నారు. కానీ వీళ్ళ స్క్రీన్ టైమ్ తక్కువ.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
కోర్టు రూమ్ సీన్స్
సంగీతం
సినిమాటోగ్రఫీ
కాంట్రవర్సీ తో హైప్
మైనస్ పాయింట్స్
స్లో ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్
చివరగా
జానకి కాదు, జస్టిస్ ఫైటర్ జానకి V… కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ వీకెండ్ కు మూవీ సెట్టు. పెద్దగా అంచనాలు లేకుండా చూస్తే బెటర్.
Janaki V v/s State of Kerala Rating : 1.75/5