BTS J-Hope: విమాన ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరగవు. కానీ జరిగినప్పుడు ప్రాణ నష్టం మాత్రం భారీగానే ఉంటుంది. అలాగే తాజాగా జేజు ఎయిర్ ఫ్లైట్ 2216కి జరిగిన ప్రమాదం ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసింది. చాలామంది అందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, తీవ్ర గాయాలతో బయటపడిన వారికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. అలాగే ఒక సింగర్ కూడా ఈ ప్రమాదాన్ని చూసి చలించిపోయాడు. అందుకే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 100 మిలియన్ డాలర్లు డొనేట్ చేయడానికి ముందుకొచ్చాడు. కొరియన్ ఫేమస్ బ్యాండ్ అయిన బీటీఎస్‌ను ఫాలో అయ్యేవారికి ఈ సింగర్ గురించి బాగా తెలుసుంటుంది. తనే జే హోప్.
తట్టుకోలేని బాధ
బీటీఎస్ సింగర్ అయిన జే హోప్ (BTS J-Hope) జేజు ఎయిర్ ఫ్లైట్ (Jeju Air Flight) 2216లో ప్రాణాలు కోల్పోయిన వారికి, ప్రమాదాలో గాయపడిన వారికి సాయంగా ఉండడం కోసం హోప్ బ్రిడ్జ్ నేషనల్ డిశాస్టర్ రిలీఫ్ అసోసియేషన్‌కు 100 మిలియన్ విరాళం అందించాడు. 100 మిలియన్ అంటే దాదాపు రూ.10 కోట్లు వారికి విరాళంగా అందించాడు. ఇది విన్న బీటీఎస్ ఫ్యాన్స్.. జే హోప్‌ది చాలా పెద్ద మనసు అని ప్రశంసిస్తున్నారు. ‘ఈ యాక్సిడెంట్ గురించి వినగానే గాయపడిన కుటుంబాలకు నా వల్ల అయినంత సాయం చేయాలని డిసైడ్ అయ్యాను. ప్రమాదంలో మృతిచెందిన వారికి నా సంతానం తెలియజేస్తున్నాను. తట్టుకోలేని బాధతో కృంగిపోతున్న ప్రతీ కుటుంబం గురించి తలుచుకుంటుంటే నా మనసు చెలించిపోతోంది’ అని చెప్పుకొచ్చాడు జే హోప్.
Also Read: నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. ‘టాక్సిక్’ కోసం యశ్ మాస్టర్ ప్లాన్
ఎలా జరిగిందంటే.?
ఇక విమాన ప్రమాదం విషయానికొస్తే.. జెజు ఎయిర్ ఫ్లైట్ 2216 అనే ఇంటర్నేషనల్ ప్యాసెంజర్ ఫ్లైట్.. జెజు ఎయిర్ అనే సంస్థకు సంబంధించింది. 2024 డిసెంబర్ 29న థాయ్‌లాండ్ బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్ నుండి ప్రారంభమయ్యి సౌత్ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సింది. కానీ దాదాపు ల్యాండ్ అవుతుంది అనే సమయానికి ఒక పక్షి వచ్చి విమానాన్ని ఢీకొట్టంది. అయినా కూడా విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. మొదటిసారి ఆ ప్రయత్నం ఫలించలేదు. పోనీ రెండోసారి అయినా ల్యాండ్ చేయాలని ప్రయత్నించినా అదే సమయంలో ప్రమాదం జరిగింది.
ఎన్నో ప్రమాదాలు
1997లో కొరియన్ ఎయిర్ ఫ్లైట్‌కు సరిగ్గా ఇలాంటి ప్రమాదమే జరిగింది. గువాన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 229 మంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత 2002లో సౌత్ కొరియా నేలపై మరొక విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ చైనా ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల 129 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని ప్రమాదాల తర్వాత ఇప్పుడు తాజాగా జెజు ఎయిర్ ఫ్లైట్‌కు జరిగిన ప్రమాదం కూడా హిస్టరీలో నిలిచపోయేలా ఉంది. దీని వల్ల కూడా 179 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఆ విమానంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు మాత్రమే పలు గాయాలతో ప్రాణాలతో బయటపడగలిగారు.