Game Changer : సాధారణంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్లలో హీరో హీరోయిన్లు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఈవెంట్ లలో హీరోయిన్లు ఉంటేనే మరింత గ్లామర్ గా ఉంటుంది. కానీ వాళ్ళు మిస్ అయితే ఏదో తెలియని వెలితి కన్పిస్తుంది. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రమోషన్లలో కూడా ఇలాంటి వెలితి కన్పిస్తోంది. హీరో తరువాత హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. కానీ ఈ పాన్ ఇండియా ఈవెంట్ లలో మాత్రం హీరోయినే కనబడుట లేదు.
నయనతార వంటి ఒకరిద్దరు హీరోయిన్లు తప్ప మిగతా వాళ్ళంతా ఖచ్చితంగా మూవీ ప్రమోషన్స్ కి హాజరవుతూ ఉంటారు. సినిమా షూటింగ్ అయిపోగానే చేతులు దులుపుకోకుండా, ప్రేక్షకుల వరకూ ఆ సినిమాలను తీసుకెళ్లాడానికి తమ వంతు సహకారం అందిస్తారు. కానీ తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) మాత్రం తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్స్ కి మిస్ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani) కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కలిసి ‘వినయ విధేయ రామ’ అనే సినిమాను చేశారు. ఆ మూవీ చెర్రీ కెరీర్ లోనే డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి మంచి పేరే వచ్చింది. అందుకే డైరెక్టర్ శంకర్ సైతం ‘గేమ్ ఛేంజర్’ మూవీలో వీరిద్దరిని మరోసారి రిపీట్ చేశారు. ఇక శంకర్ సినిమాలో హీరోయిన్లు ఎంత ప్రత్యేకంగా అద్భుతంగా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కియారాను మరింత అందంగా చూపించారని ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
కారణం ఏంటో తెలీదు గానీ కియారా అద్వానీ మాత్రం ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ వస్తుంది. లక్నోలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో కనిపించిన కియారా మళ్లీ ఇంతవరకు ఎక్కడా మూవీ ప్రమోషన్స్ లో కనిపించలేదు. డల్లాస్ ఈవెంట్ ను మొదలు పెడితే, నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ఈ బ్యూటీ మిస్సైంది. మరి రేపు జరిగే ఈ సినిమా ప్రీ రిలీజ్ కు అయినా కియారా అద్వాని హాజరవుతుందా? అన్నది కొత్త చర్చకు దారి తీసింది.
అసలు కియారా (Kiara Advani) ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ ను పక్కన పెట్టడానికి కారణం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉందా? లేదంటే చిత్ర బృందంతో ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అనేది అనే అనుమానాలు మొదలవుతున్నాయి. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించబోతున్నారు. రాజమండ్రిలో ఈవెంట్ ను ప్లాన్ చేశారు. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేటర్లలోకి రాబోతోంది.