Cyclone Alfred in Australia: ఆల్ఫ్రేడ్ తుఫాన్ ఆస్ట్రేలియా తూర్పు తీరం వైపు దూసుకుపోతుంది. ఉష్ణమండల తుఫాను ఆల్ఫ్రెడ్ శనివారం ఉదయం సన్‌షైన్ కోస్ట్ ప్రాంతం, దక్షిణాన గోల్డ్ కోస్ట్ నగరం మధ్య నుంచి క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియాలజీ ప్రకారం, ఆల్ఫ్రెడ్ ఆగ్నేయ క్వీన్స్‌ల్యాండ్ తీరం వైపు కదులుతోంది. ఇది కేటగిరీ 2 తుఫాను (ఇది గాలి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది). గంటకు 95 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వరకు వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది. ఇది “క్వీన్స్‌ల్యాండ్‌లోని డబుల్ ఐలాండ్ పాయింట్ నుండి న్యూ సౌత్ వేల్స్‌లోని గ్రాఫ్టన్ వరకు, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, సన్‌షైన్ కోస్ట్, బైరాన్ బే మరియు బల్లినాతో సహా” ప్రభావితం చేసే అవకాశం ఉంది. విపరీతమైన గాలి, వర్షం ఇప్పటికే ప్రభావిత ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తుఫాన్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Bank of Baroda: డిగ్రీ అర్హతతో 4000 జాబ్స్.. తెలంగాణ, ఏపీలో కూడా ఖాళీలు.. స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్..
మామూలుగా తుఫాన్ ప్రభావం ఆస్ట్రేలియా దేశంలో ఉత్తర ప్రాంతాలకు ఉంటుంది. 1974లో గోల్డ్ కోస్ట్ ప్రాంతానికి చివరిసారిగా తుఫాను సంభవించింది. అంటే 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్టేలియాకు ఉష్ణ మండల తుఫాన్ సంభవించింది. 1974లో జోయ్ తుఫాను గోల్డ్ కోస్ట్‌ను తాకి విస్తృతమైన వరదలకు లోనైంది. ఆస్ట్రేలియా దక్షిణ ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉంటుంది. బ్రిస్బేన్ నగరం దేశంలో మూడవ అత్యధిక జనాభా కలిగిన నగరం. దాదాపు 40 లక్షల మంది ప్రజలు తుఫాను ఆల్ఫ్రెడ్ మార్గంలో ఉన్నారు. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు తుఫానులను తట్టుకునేలా లేవు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ మీడియాతో మాట్లాడారు. ‘ఇది ఒక అరుదైన సంఘటన, ఉష్ణమండలంలో భాగంగా వర్గీకరించబడని ప్రాంతంలో, ఆగ్నేయ క్వీన్స్‌ల్యాండ్, ఉత్తర న్యూ సౌత్ వేల్స్‌లో ఉష్ణమండల తుఫాను ముంచెత్తింది” అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్ అన్నారు.
టాస్మాన్ సముద్రం సముద్రం మీదుగా ఏర్పడిన ఈ ఆల్ఫ్రెడ్ తుఫాను ప్రమాదకరంగా తయారైంది. ప్రస్తుతం ఈ పశ్చిమ తీరానికి కూడా వ్యాపిస్తుంది. ‘తుఫాన్ ఆకస్మిక పశ్చిమ దిశగా ఆగ్నేయ క్వీన్స్‌ల్యాండ్, ఉత్తర న్యూ సౌత్ వేల్స్‌లోని అధిక జనాభా ఉన్న ప్రాంతాల వైపు నేరుగా దూసుకొచ్చింది. ఈ గాలులు అంత బలంగా వీచడం లేని.. అందుకే తుఫాన్ నెమ్మదిగా కదులుతోందని ఆస్ట్రేలియా జాతీయ శాస్త్ర సంస్థ సీఎస్ఐఆర్ఓ పేర్కొంది.
వాతావరణ మార్పుల వల్ల ఇది జరిగిందని కచ్చితంగా చెప్పలేనప్పటికీ.. వాతావరణ మార్పుల ప్రభావాల వల్ల తుఫానులు ముంచెత్తుతున్నాయి. అయితే ఈ ఆల్ఫ్రెడ్ తుపాన్ గురువారం లేదా శుక్రవారం ప్రారంభంలో తీరాన్ని తాకుతుందని వాతావరణ అధికారులు భావించారు. కానీ ఇప్పుడు శనివారం ఉదయం నాటికి మాత్రమే తీరాన్ని తాకే అవకాశం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తుఫాను నెమ్మదిగా తీరం వైపు వెళ్తోంది. ప్రాథమికంగా, అది ఒక ప్రాంతంపై ఎక్కువసేపు వీస్తుంది. తుఫాన్ నెమ్మదిగా వచ్చినా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకిన తర్వాత, దానికి తక్కువ తేమ ఉంటుంది. అందువల్ల దాని తీవ్రత కూడా తగ్గుతుంది. ఆల్ఫ్రెడ్ తుఫాన్ నెమ్మదిగా కదలడం వల్ల భారీ అలలు కూడా ఎక్కువసేపు ఉంటాయి. తీరప్రాంతంలో వరదలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని CSIRO చెబుతోంది.
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం, “ఉష్ణమండల తుఫాను అనేది ఉష్ణమండల లేదా ఉపఉష్ణమండల మహాసముద్రాలపై తుఫాన్ ఏర్పడి బలమైన గాలులు, కుండపోత వర్షంతో కురిసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షం పడుతోందని తెలిపింది. వెచ్చని ఉష్ణమండల సముద్ర జలాలపై అల్పపీడన వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు.. అది వెచ్చని, తేమతో కూడిన గాలిని పైకి లేపుతుంది. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం.. గాలి వేగం గంటకు 63 కి.మీ దాటినప్పుడు వాతావరణ వ్యవస్థను సూచించడానికి ‘ఉష్ణమండల తుఫాను’ అనే పదాన్ని వాడొచ్చు.