BigTV English

Gabbar Singh Movie Re Release: సరికొత్త రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్! వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ల మోత మోగించాడుగా..

Gabbar Singh Movie Re Release: సరికొత్త రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్! వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ల మోత మోగించాడుగా..

Gabbar Singh Movie Re Release: ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. నేరుగా థియేటర్స్‌లో విడుదలైన సాధారణ సినిమాల కంటే ఎప్పుడో రిలీజ్ అయిన మూవీస్ ఇప్పుడు రీరిలీజ్ చేస్తే.. భారీ కలెక్షన్స్‌ను సాధిస్తున్నాయి. ఇటీవల మురారి, ఇంద్ర మూవీస్ మంచి రికార్డ్‌లను సృష్టించగా.. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ రీరిల్ చేయగా వాటికి మించిన కలెక్షన్స్ సాధించి ఒక సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. నిజానికి అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టి మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్‌ల రికార్డ్‌లను వెనక్కి నెట్టేశాడు.


కలెక్షన్ల వర్షం
తొలిరోజు గబ్బర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ.7.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటిదాక మహేష్ బాబు నటించిన మురారి మూవీ రీరిలీజ్ కాగా రూ. 4.40కోట్లగో టాప్ ప్లేసులో ఉండగా.. గబ్బర్ సింగ్ మూవీ ఆ రికార్డ్‌ను తుడిచిపెట్టేసింది. మురారి కంటే ఏకంగా మూడు కోట్లు ఎక్కువ కలెక్షన్స్ సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చున్నాడు. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.5.95 కోట్ల కలెక్షన్స్ సాధించి.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీ గబ్బర్ సింగ్ నిలిచిపోయింది.

Also Read: తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం.. అల్లు అర్జున్‌ రూ.కోటి సాయం


ఎక్కడ ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో గ‌బ్బర్ సింగ్ మూవీకి ఫ‌స్ట్ డే నైజాం ఏరియాలో దాదాపు రూ. 2.90 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. అయితే, ఈ ఏరియాలో మహేష్ బాబు టాప్‌లో ఉన్నాడు. కారణం మ‌హేష్‌బాబు మురారి మూవీకి రూ. 2.92 కోట్ల కలెక్షన్స్ రావడమే. ఇక సీడెడ్ ఏరియాలో దాదాపు రూ.81లక్షలు సాధించింది. ఈస్ట్ గోదావ‌రిలో రూ.46 లక్షలు, వెస్ట్ గోదావ‌రి రూ.40లక్షలు కొల్లగొట్టింది. ఇక గుంటూరులో రూ.45లక్షలు, కృష్ణాలో రూ.39లక్షలు, నెల్లూరులో రూ.11లక్షల కలెక్షన్స్ రాబట్టింది.

మళ్లీ రిపీట్ అవుద్దా?
ఈ గబ్బర్ సింగ్ మూవీ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ గబ్బర్ సింగ్ మూవీ 2012లో విడుదలై ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కేవలం రూ.30 కోట్లతో హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కించగా.. ఏకంగా రూ.105 కోట్ల కలెక్షన్స్ సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోయింది. ఇక గబ్బర్ సింగ్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద గబ్బర్ సింగ్ రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ప్రస్తుతం మళ్లీ పవన్, హరీష్ కాంబోలనే ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. దీన్ని కూడా తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తేరి మూవీకి రీమేక్‌గా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ ఉప‌ముఖ్యమంత్రి బాధ్యతలతో బిజీగా ఉండ‌టంతో షూటింగ్ డిలే అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.

 

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×