BigTV English

Game Changer Story Leak: స్టోరీ మొత్తం లీక్ అయ్యిందిగా..! మెయిన్ విలన్ సూర్య కాదు..?

Game Changer Story Leak: స్టోరీ మొత్తం లీక్ అయ్యిందిగా..! మెయిన్ విలన్ సూర్య కాదు..?

Game Changer Story Leak: శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఒక నిజాయితీ గల ఐఏఎస్ కథ అని మేకర్స్ ముందు నుండి చెప్తూనే ఉన్నారు. ప్రతీ ప్రమోషన్‌లో ఇది ఐఏఎస్ రామ్ నందన్ కథ అని, విలన్ అయిన మోపీ దేవి (ఎస్ జే సూర్య)తో తను ఎలా తలబడనున్నాడో తెరపై చూడాలని ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారు. ప్రేక్షకులు కూడా ‘గేమ్ ఛేంజర్’ కథ ఇలాగే ఉంటుందని ఒక అంచనాకు వచ్చేశారు. కానీ రియాలిటీలో అలా లేదు. ఈ మూవీ పూర్తిగా ఒక రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. నిజాయితీ గల ప్రభుత్వాధికారి, అవినీతి మినిస్టర్ మధ్య జరిగే కథ అని చెప్పడం కంటే ‘గేమ్ ఛేంజర్’ను ఒక పర్ఫెక్ట్ రివెంజ్ స్టోరీ అని చెప్తే కరెక్ట్‌గా ఉంటుంది.


నిజాయితీతోనే తెగింపు

‘గేమ్ ఛేంజర్’ మొదలవ్వగానే ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులకు పరిచయమవుతాడు రామ్ చరణ్. తన పాత్ర పేరే రామ్ నందన్. ఒక ప్రభుత్వాధికారిగా ఎప్పుడూ మంచి పనులే చేస్తూ అందరికీ సాయం చేస్తుంటాడు. తాను ఏ జిల్లాకు అయితే ఐఏఎస్‌గా ఉంటాడో.. ఆ జిల్లాను చాలా అభివృద్ధి చేస్తాడు. ఆ జిల్లాకు రోడ్లు వేయిస్తాడు, మంచి నీటి పరఫరా వచ్చేలా చేస్తాడు. ఇవన్నీ పలువురు రాజకీయ నాయకులకు ఇష్టం లేకపోయినా వారిని ఎదిరించి అందరికీ సాయం చేయాలనే ఆలోచనలోనే ఉంటాడు. అదే సమయంలో రామ్ నందన్ జీవితంలోకి కృష్ణుడు ఎంటర్ అవుతాడు.


‘గేమ్ ఛేంజర్’లో కృష్ణుడు ఒక బడా వ్యాపారవేత్త. చెరువులు కబ్జా చేసి అక్కడ పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు నిర్మిస్తాడు. ఇది తెలుసుకున్న రామ్ నందన్.. ఎవరికీ భయపడకుండా ఆ కాంప్లెక్స్‌లు అన్నింటినీ కూల్చి వేస్తాడు. ఆ సీన్స్‌ను తెరపై చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనే గుర్తొస్తుంది. ఆయన కూడా అక్రమ కట్టడాలను ఇలాగే కూల్చివేశారు కదా అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. కృష్ణుడు కట్టిన కాంప్లెక్స్‌లు అన్నీ కూల్చి వేయడంతో రామ్ నందన్.. మోపీ దేవికి టార్గెట్ అవుతాడు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ కాంప్లెక్స్‌లు కృష్ణుడివే అయినా.. పరోక్షంగా దాని వెనుక ఉన్నది మంత్రి మోపీ దేవి. అలా రామ్ నందన్, మోపీ దేవి మధ్య ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్ వస్తుంది.

Also Read: గేమ్ ఛేంజర్ హైలెట్స్ ఇవే.. ఫ్యాన్స్.. మీకు ఫస్ట్ సీన్ నుంచే ఫుల్ పూనకాలు.!

సెకండ్ హాఫ్‌లో అలా..

సెకండ్ హాఫ్‌లో రామ్ నందన్ తండ్రి అప్పన్నను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు దర్శకుడు. పల్లెటూరిలో ఒక రాజకీయ పార్టీ పెట్టి అందరికీ సాయంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు అప్పన్న. అదే పార్టీలో ఎస్ జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్ భాగమవుతారు. కానీ ఈ ముగ్గురికి అప్పన్న సీటుపైనే కన్ను ఉంటుంది. అలా ఒకరోజు అప్పన్నను, తన భార్య అంజలిని, తన పిల్లల్ని చంపాలని శ్రీకాంత్ నిర్ణయించుకుంటాడు. తను చేసిన దాడిలో అందరూ చనిపోయినా పిల్లలు మాత్రం బ్రతికి బయటపడతారు. అలా తన పిల్లల్లో ఒకడు రామ్ నందన్ ఐఏఎస్‌గా మారి తన తండ్రిని చంపిన వారిపై రివెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

బ్రేక్ ఈవెన్ ఈజీ

‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని విభాగాల్లో సూపర్.. పాటలు, అందులో గ్రాఫిక్స్ సూపర్.. స్టోరీ సూపర్.. కానీ మేకర్స్ చెప్పినట్టుగా ఈ సినిమాకు రూ.500 కోట్లు అవసరం లేదనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో తప్పకుండా వస్తుంది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో కూడా ఇలాంటి సినిమాను తెరకెక్కించవచ్చు కదా అని అనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ద్వారా రూ. 70 కోట్లను కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు కలెక్ట్ చేయగలిగితే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ వస్తుంది. టాక్ బాగుంది కాబట్టి ఫస్ట్ వీకెండ్‌లోపే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ‘పుష్ప 2’ను బీట్ చేసే కలెక్షన్స్ ‘గేమ్ ఛేంజర్’ సాధించలేకపోవచ్చు అని ఇండస్ట్రీ నిపుణుల అంచనా.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×