Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) కూడా ఒకటి. తాజాగా ఈ మూవీ మేకర్స్ కి లీకు రాయుళ్ళు షాక్ ఇచ్చారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ (Maata Vinali) సాంగ్ ను లీక్ చేశారు.
పవన్ కళ్యాణ్ – యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu). ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హిందీ నటుడు బాబి డియోల్ విలన్ గా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఏఎమ్ రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మేకర్స్ నెమ్మదిగా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘మాట వినరా’ పాటను జనవరి 6న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్ట్ ని కూడా రిలీజ్ చేసి ఆ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడారని చెప్పారు. కానీ తీరా టైం రాగానే ఈ పాటను పలు అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రకటించి, మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది ‘హరిహర వీరమల్లు’ టీం.
ఇలా చెప్పినట్టుగా చెప్పి పాటను పోస్ట్ పోన్ చేయడం ఏంటి ? అంటూ నిర్మాణ సంస్థపై మెగా ఫ్యాన్స్ మండిపడుతుంటే, మరోవైపు వారి కోపాన్ని మరింతగా పెంచే విధంగా మాట “మాట వినరా” సాంగ్ లీక్ అయ్యింది. అది కూడా పవన్ కళ్యాణ్ డప్పు కొడుతూ పాడుతున్న ఈ ఫుల్ హెచ్డి వీడియో సాంగ్ లీక్ కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఆ లీక్ అయిన (Maata vinali) వీడియో ప్రకారం చూస్తే అందులో “కొట్టు… మాట వినాలి గురుడా మాట వినాలి… మాట వినాలి మంచి మాట వినాలి.. ఒంటరిగా పోమాక తొందర పడకా…” అనే లిరిక్స్ విన్పిస్తున్నాయి. పవన్ డప్పు కొడుతూ ఈ పాటను పాడుతుంటే, చుట్టూ చలి మంట కాచుకుంటున్న వాళ్ళు దీనికి కోరస్ అందిస్తున్నట్టు ఆ లీకైనా వీడియోలో ఉంది. మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఒకదాని తర్వాత ఒకటి ఇలా డిసప్పాయింట్మెంట్ కలిగించే న్యూస్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆయన నటిస్తున్న రెండు సినిమాల రిలీజ్ లు లేట్ కాగా, ఇప్పుడేమో పాట పోస్ట్ పోన్ కావడం, అంతలోనే అది లీక్ కావడం వంటివి జరగడం నిజంగా మెగా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగానే ఉంది. అంతేకాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తను డేట్స్ ఇచ్చినా నిర్మాతలు ఉపయోగించుకోలేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో ‘హరిహర వీరమల్లు’ టీం “విసిగించకండి” అంటూ ఓ పోస్ట్ ని వదిలారు. మరి ఈ నేపథ్యంలో లీకైన ‘మాట వినరా’ వీడియో సాంగ్ పై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.