BigTV English

The India House: ది ఇండియా హౌస్.. పూజతో ప్రారంభం

The India House: ది ఇండియా హౌస్.. పూజతో ప్రారంభం

The India House movie update(Latest movies in tollywood): యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లేవల్లోనే ప్లాన్ చేస్తున్నాడు. కార్తికేయ 2 తరువాత స్పై సినిమాతో వచ్చిన నిఖిల్ కు విజయం దక్కలేదు.


ఇక ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి స్వయంభు.. రెండు కార్తికేయ 3.. మూడు ది ఇండియా హౌస్. స్వయంభు శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసే పని లో ఉండగా.. కార్తికేయ 3 ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ది ఇండియన్ హౌస్ ను నిఖిల్ పట్టాలెక్కించాడు. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణ సంస్థ వి మెగా పిక్చర్స్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. ఇక ఎప్పుడో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. తాజాగా హంపిలోని విరూపాక్ష ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శివుని ఆశీస్సులు అందుకొని ది ఇండియన్ హౌస్ ను మొదలుపెట్టినట్లు నిఖిల్ పూజా వీడియో ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


ఇకపోతే ఈ సినిమా 1905 లో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిఖిల్ స్వయంభు చిత్రంతో పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక అటుఇటుగా ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందని టాక్. మరి ఈ సినిమాలతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×