Big Tv Live Originals: కుంభాలు కుంభాలు తిన్నా కొందరు బరువు మాత్రం అస్సలే పెరగరు. తినడం బాగానే తిన్నా చూడడానికి మాత్రం చాలా వీక్‌గానే కనిపిస్తారు. బరువు పెరగడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. బరువు పెరగాలని వర్కౌట్స్ చేస్తే కొన్ని సార్లు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎంత తిన్నా బరువు పెరగకపోవడం వెనుక ఏమైనా కారణాలు ఉంటాయా? లావు అవ్వాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు పెరగకపోవడానికి చాలా కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు జెనెటికల్ రీజన్స్ వల్ల తక్కువ బరువుతో ఉంటే.. జీవక్రియ, జీవనశైలి వంటి కారణాల వల్ల కొంతమంది బరువు పెరగడం కష్టంగా ఉంటుంది.
కొంతమందికి సహజంగానే వేగవంతమైన జీవక్రియ ఉంటుంది. అంటే తిని ఏ పనీ చేయకుండా ఉరికే కూర్చున్నా వారి శరీరం కేలరీలను త్వరగా బర్న్ చేస్తుంది. తీసుకున్న ఆహారంలోని కేలరీలను ఎక్కువగా బర్న్ చేయడం వల్ల వారు బరువు(Weight) పెరగడం కష్టతరం అవుతుంది. దీంతో ఎంత తిన్నా బరువు మాత్రం పెరిగే అవకాశం లేకుండా పోతుంది.
బాడీ రకాన్ని బట్టి, శరీరం ఆహారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో డిసైడ్ జెనెటిక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొంతమంది సహజంగానే చాలా సన్నగా ఉంటారు. దీనికి కారణం కండరాల ద్రవ్య రాశి కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వారిలో కేలరీలు చాలా త్వరగా కరిగిపోతాయట. దీంతో ఆహారం ద్వార వచ్చిన ఎనర్జీ దానికే సరిపోతుందట.
బాగా యాక్టివ్‌గా ఉండే వారు తరచుగా వ్యాయామం చేయకపోయినా, వాకింగ్ వంటి రోజువారీ కార్యకలాపాలు చేయడం ద్వారా ఎక్కువ కేలరీలను బర్న్ చేయవచ్చు. వీళ్లు ఎక్కువగా తిన్నప్పటికీ బరువు పెరగడం మాత్రం చాలా కష్టతరంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరికొందరిలో థైరాయిడ్ సమస్యలు బరువు పెరగకపోవడానికి కారణం కావచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.
థైరాయిడ్ గ్లాండక విడుదల చేసే కొన్ని హార్మోన్లు జీవక్రియను కూడా ప్రభావితం చేస్తాయట. హైపర్ థైరాయిడిజం బరువు తగ్గడానికి లేదా బరువు పెరగడంలో ఇబ్బందికి దారితీస్తుంది.
కొంతమందికి జీర్ణ సమస్యలు ఉండడం వల్ల ఏం తిన్నా వీక్‌గానే ఉంటారు. దీని వల్ల తిన్న ఆహారం నుంచి శరీరంలో కేలరీలను కూడా గ్రహించలేకపోతుందట. సెలియాక్ వ్యాధి వంటివి జీర్ణశయాంతర సమస్యలు పోషక శోషణను ప్రభావితం చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
ALSOREAD: సమ్మర్‌లో ఈ ఫుడ్ తింటే అంతే..!
ఇవి తింటే బరువు పెరగొచ్చు..!
బరువు పెరగాలనుకుంటే, ఎక్కువగా కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రోజూ చేసే పనుల వల్ల కొన్ని కేలరీలు కరిగిపోయినా.. మరికొన్ని ఎనర్జీ కోసం సహాయపడతాయట.
అందుకే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అవోకాడోలు, పీనట్ బట్టర్స్, బాదం, వేరుశెనగ, జీడిపప్పు వంటి కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ప్రోటీన్లను కూడా అందిస్తాయట.
కెన్, టర్కీ, మీట్ వంటి వాటిలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుందట. అంతేకాకండా కోడి గుడ్లను కూడా ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు పెరగడం మరింత ఈజీ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ప్రోటీన్ అధికంగా ఉండే బీన్స్, కాయధాన్యాలు, చిక్‌పీస్ వంటి వాటిని ప్రతి రోజూ తీసుకునే డైట్‌లో చేర్చుకోవడం మంచిది. తరచుగా వీటిని తింటే నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపించే ఛాన్స్ ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.