Trinath Rao Nakkina: మైక్ ఉంది కదా అని ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఏది పడితే అది మాట్లాడకూడదు.ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే అంశాల గురించి అస్సలు మాట్లాడకూడదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఎవరైనా సరే నోరు ఎంత అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఇండస్ట్రీలో అన్ని ఎక్కువ రోజులు ఉంటారు. ఈ విషయం తెలిసిన పెద్ద పెద్ద వాళ్లే స్టేజిలపై ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇక ఒక తెలుగు డైరెక్టర్ స్టేజిమీద అందరూ ఉన్నప్పుడే హీరోయిన్ గురించి డబుల్ మీనింగ్ లో మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాడు. ఆయన ఎవరో ఈపాటికే మీకు తెలిసి ఉంటుంది. ఆయనే త్రినాథరావు నక్కిన.
సినిమాలు హిట్ అయితే గౌరవం రాదు.. అందరిముందు ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆయన గురించి నెటిజన్స్ అంటున్న మాటలు ఇవి. ఇప్పటివరకు మంచి సినిమాలతో హిట్ అందుకున్న త్రినాథరావు తాజాగా మజాకా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంతో అందాల భామ అన్షు అంబానీ రీఎంట్రీ ఇస్తుంది. మన్మథుడు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ చిన్నది.. కేవలం మూడు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యింది. అనంతరం పెళ్లి చేసుకొని భర్తతో విదేశాల్లో సెటిల్ అయ్యిపోయింది.
ఇక గతేడాది మన్మథుడు రీరిలీజ్ వేడుకల్లో ఈ చిన్నది సందడి చేసింది. దీంతో అన్షు రీఎంట్రీ ఎప్పుడు అని అడగడం మొదలుపెట్టారు అభిమానులు. ఇక మంచి కథ దొరికితే రీఎంట్రీ ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేదని చెప్పిన అన్షు.. మజాకా కథ నచ్చడంతో ఆ సినిమాను ఓకే చేసింది. ఇందులో రావు రమేష్ కు జంటగా ఆమె కనిపిస్తుంది. మజాకా టీజర్ లాంచ్ లో ఆమె కూడా పాల్గొంది.
Game Changer : గేమ్ ఛేంజర్ మూవీపై జానీ మాస్టర్ కొడుకు రివ్యూ… ఏం చెప్పాడు భయ్యా!
ఇక ఆమె గురించి త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ” మన్మథుడు సినిమా టైమ్ లో ఆమె కోసమే సినిమాకు వెళ్లేవాళ్లం. ఆమె కోసం కొట్టుకొనేవాళ్ళం. ఓ రేంజ్ లో ఉండేది. అలాంటి అమ్మాయి ఇప్పుడు కళ్లముందు రావడంతో ఏంటి నిజమేనా అని అనిపించింది. ఇప్పుడు అలానే ఉంది. కొంచెం సన్నబడింది. నేనే కొద్దిగా తిని పెంచమ్మా.. తెలుగుకు సరిపోదు. అన్ని కొంచెం ఎక్కువ సైజ్ లలో ఉండాలి. పర్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక అతడి మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
ఒక హీరోయిన్ గురించి అసలు ఒక మహిళ గురించి డైరెక్టర్ ఇలా మాట్లాడతాడు.. సైజ్ ల గురించి మాట్లాడడం ఏంటి అంటూ నెటిజన్స్ అతనిపై దుమ్మెత్తిపోశారు. వారితో పాటు త్రినాథరావు నక్కినపై మహిళా కమీషన్ ఫైర్ అయ్యింది. అతని వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా అధికారికంగా తెలిపింది. దీంతో దిగివచ్చిన డైరెక్టర్ మహిళా సంఘాలకు, అన్షుకు క్షమాపణలు కోరుతూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
” అందరికీ నమస్కారం.. నా పేరు త్రినాథరావు నక్కిన. నిన్న మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యలు కొంతమంది మహిళలను నొప్పించాయి.అందరికీ చెప్తున్నాను. నేను కావాలని చేసింది కాదు. అక్కడ ఉన్నవారిని నవ్వించడానికి చేసిన పని. అయినా సరే మీ అందరి మనసులను నొప్పించింది కాబట్టి తప్పు తప్పే. అందుకే మీ అందరిని క్షమాపణ అడుగుతున్నాను. ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా హీరోయిన్ ను కూడా మ్యానరిజం తో కొన్ని మాటలు అన్నాను. అది కూడా తప్పే. దానికి కూడా సారీ చెప్తున్నాను. దయచేసి ఈ మాటలను తప్పుగా తీసుకోకుండా పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అన్షు గారు నన్ను క్షమించండి : త్రినాథరావు#Anshu #TrinadhaRao #Mazaka #Tollywood #LatestNews #BigTvCinema pic.twitter.com/0yCHEi9akE
— BIG TV Cinema (@BigtvCinema) January 13, 2025