BigTV English
Advertisement

Om Raut: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు మరో అవకాశం.. రిస్క్ తీసుకుంటున్న స్టార్ హీరోలు

Om Raut: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు మరో అవకాశం.. రిస్క్ తీసుకుంటున్న స్టార్ హీరోలు

Om Raut: మామూలుగా ఒక దర్శకుడు తెరకెక్కించిన సినిమా హిట్ అయితేనే తను తరువాత చెప్పే కథలు వినడానికి హీరోలు సిద్ధంగా ఉంటారు. లేకపోతే ఒక్కసారిగా ఆ డైరెక్టర్ మార్కెట్ పడిపోతుంది. ఫ్లాప్ వచ్చినా కూడా దర్శకులను నమ్మి సినిమాలు చేసే హీరోలు కూడా ఉంటారు. కానీ దానికంటే అది రిస్క్ అని భావించే స్టార్ల సంఖ్యే ఎక్కువ. ఒక దర్శకుడు.. పాన్ ఇండియా అనే ట్యాగ్‌తో ఒక మూవీని తెరకెక్కించి అది డిశాస్టర్ అయితే.. ఇక తన కెరీర్‌కు పెద్ద బ్రేక్ పడినట్టే. ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ గురించి కూడా ఆడియన్స్ అదే అనుకున్నారు. కానీ ఇంకా తనను నమ్మి అవకాశం ఇవ్వడానికి ఇద్దరు బాలీవుడ్ బడా స్టార్లు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


ఎన్నో ట్రోల్స్

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత బాలీవుడ్‌లో కూడా తనకు మార్కెట్ పెరగడం కోసం ఓం రౌత్‌ (Om Raut)తో కలిసి రామాయణ కథలో నటించడానికి ఒప్పుకున్నాడు. ‘ఆదిపురుష్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా అత్యంత భారీ హైప్ మధ్య విడుదలయ్యింది. కానీ ఆ హైప్‌ను సినిమా రీచ్ అవ్వలేకపోయింది. ‘ఆదిపురుష్’ విడుదలయిన మొదటి రోజు నుండే ఈ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. సినిమా బాగుందా, బాలేదా అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు రామాయణ కథను ఇలా తెరకెక్కిస్తారా అంటూ ఓం రౌత్‌పై నెగిటివ్ కామెంట్స్ చేశారు ప్రేక్షకులు. అందుకే అప్పటినుండి ఇప్పటివరకు ఓం రౌత్ మరొక సినిమా తెరకెక్కించలేదు.


Also Read: నేషనల్ ఆల్ అమెరికా మిస్ పోటీల్లో తెలుగమ్మాయి సత్తా..

మరొక బయోపిక్

బాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. తన తరువాతి సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టాడట ఓం రౌత్. ఈ వార్త బయటికి రావడంతో ఇంకా బీ టౌన్‌కు ఓం రౌత్‌పై ఉన్న నమ్మకం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ కంటే ముందు ‘తన్హాజీ’ అనే ఒక మూవీని తెరకెక్కించాడు ఓం రౌత్. అది కూడా ఒక బయోపిక్‌గానే తెరకెక్కింది. ఆ మూవీకి ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు ఓం రౌత్. అందుకేనేమో ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’తో తనకు అవకాశమిచ్చాడు. ఇప్పుడ ‘తన్హాజీ’ కాంబినేషనే మరోసారి రిపీట్ అవ్వనుందని ఆడియన్స్ అనుకుంటున్నారు.

ఇంకా చర్చల్లోనే

‘తన్హాజీ’లాగానే అజయ్ దేవగన్‌తో మరొక హిస్టారికల్ బయోపిక్ తెరకెక్కించాలని ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ‘తన్హాజీ’ లాంటి హిట్ ఇవ్వడంతో అజయ్ కూడా ఓం రౌత్‌కు మరొక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. అందులో విలన్‌గా హృతిక్ రోషన్‌ను ఎంపిక చేసినట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ స్టేజ్‌లోనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు హృతిక్ రోషన్ ఓకే చెప్పినా చెప్పకపోయినా అజయ్ మాత్రం చాలావరకు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మూవీని ఎవరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కాలని చర్చలు మొదలయ్యాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×