Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు మార్కెట్లో వారి సినిమాలకు ఉండే డిమాండ్ ఆధారంగా రెమ్యూనరేషన్ (Remuneration) కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇలా హీరోలు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడంతో వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది హీరోలు మాత్రం తమ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంటే పూర్తిస్థాయిలో నిర్మాతల నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నష్టాలు వస్తే మాత్రం తమ రెమ్యూనరేషన్ కొంత భాగం వెనక్కి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు.
ఆర్థిక ఇబ్బందుల్లో నిర్మాత…
ఇలా రెమ్యూనరేషన్ తిరిగి వెనక్కి ఇవ్వాలంటే అందరికీ వీలు అవ్వదు, ఇలా ఇవ్వాలన్న ఎంతో గొప్ప మనసు ఉండాలి. ఇలాంటి గొప్ప మనసు మన డిప్యూటీ సీఎం సాబ్, నటుడు పవన్ కళ్యాణ్ కు ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ అంతకుముందు కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజానికి ఈ సినిమా ఈ నెల 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.
11 కోట్ల అడ్వాన్స్ వెనక్కి…
ఇలా ఈ సినిమా షూటింగ్ కూడా చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ రావడం వల్ల నిర్మాతపై కాస్త అధిక భారమే పడిందని చెప్పాలి. ఇలా నిర్మాతకు ఆర్థిక సమస్యలు ఎదురవడంతో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కేవలం అడ్వాన్స్ కింద రూ. 11 కోట్ల రూపాయల మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్మాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారని తెలుసుకున్న పవన్ ఈ సినిమాకు ఆయన తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి వెనక్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
నిర్మాత ఎ ఎం రత్నం కు అడ్వాన్స్ వెనక్కి ఇవ్వనున్న పవన్ కళ్యాణ్
హరి హర వీర మల్లు సినిమాకు ఇప్పటి వరకూ 11 కోట్లు మాత్రమే అడ్వాన్స్ తీసుకున్న పవన్, అయితే నిర్మాత రత్నం ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బంది లో ఉన్నారు అని తెలుసుకున్న పవన్ అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడానికి… pic.twitter.com/to4mNgOoKZ
— IndiaGlitz Telugu™ (@igtelugu) June 4, 2025
ఇలా 11 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడమే కాకుండా సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమాని ప్రశాంతంగా విడుదల చేయాలి అంటూ నిర్మాత ఎ.యం.రత్నంకు (A.M.Ratnam)సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ నిర్మాత కష్టాన్ని గుర్తించి ఆయనకు డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప మనసు అందరికీ ఉండదని పవన్ కళ్యాణ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 12వ తేదీ విడుదల వాయిదా పడటంతో తిరిగి జులై 4వ తేదీ విడుదల కావచ్చని తెలుస్తోంది. నిర్మాతలు మాత్రం ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. అయితే ఒక్కసారిగా ఈ సినిమా వాయిదా పడింది అని తెలియగానే అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.