Viral Video: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాసేపు ఫైట్ క్లబ్‌గా మారిపోయింది. ఇరు గ్రూపుల మధ్య ఫైటింగ్ జరిగింది. ఒకరిపై మరొకరు పంచ్‌లు విసురుకున్నారు. ఆ పరిస్థితి రావడానికి కారణమేంటి? దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై ఎయిర్‌పోర్టు గురించి చెప్పనక్కర్లేదు. రోజుకు వేలాది మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తుంటారు. కనీసం పావుగంట కూడా ఖాళీ ఉండదు. అలాంటిది ఎయిర్‌పోర్టులోని టీ2 టెర్నినల్ వద్ద పార్కింగ్ విషయంలో సెక్యూరిటీ గార్డులు- క్యాబ్ డ్రైవర్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. చివరకు అది తీవ్రరూపం దాల్చింది.
నువ్వెంత అంటే నువ్వెంత స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఇరువర్గాలు ఆగ్రహానికి లోనయ్యారు. ఒకరిపై మరొకరు ముష్టిఘాతాల మాదిరిగా పంచ్‌లు విసురుకున్నారు. కింద పడేసుకున్నారు కూడా. చివరకు ఈ గొడవ వ్యవహారం ఎయిర్‌పోర్టులోని సీఐఎస్ఎఫ్ దృష్టికి వచ్చింది. వెంటనే అక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డులు- క్యాబ్ డ్రైవర్లను విడిపించారు.
ఘటన సమయంలో ఎయిర్‌పోర్టుకి వచ్చిన ట్రావెల్, ఆ సన్నివేశాన్ని చూసి షాకయ్యారు. ఈ సమయంలో ఆ సన్నివేశాన్ని అందరూ సినిమా చూసినట్టు చూశారేకానీ, వారిని విడిపించే ప్రయత్నం చేయలేదు. దీంతో కొద్దిసేపు విమానాశ్రయంలో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పోలీసుల అధికారులు అక్కడికి చేరుకుని ఇరువురుని విడదీశారు.
ALSO READ: కోతికి కరెంట్ షాక్.. సీపీఆర్ చేస్తే కాసేపటికి
విచారణ కోసం వారిని తీసుకెళ్లారు. ఘర్షణలో పాల్గొన్న రెండు వర్గాలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. టాక్సీడ్రైవర్-సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫైటింగ్ వ్యవహారంపై విమానాశ్రయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత అంతర్గత భద్రతా ప్రోటోకాల్‌ను సమీక్షించవచ్చని అంటున్నారు.
मुंबई एयरपोर्ट पर पार्किंग को लेकर जमकर चले लात-घूंसे…
.
.
.
.
.
.
.
.#Mumbai #ViralVideo #MumbaiInternationalAirport #MumbaiAirport #CISF #Fight #HbtvNews #HBTVNews #HBTVBreakingNews #HBTVLiveUpdates #IndiaTrendingNews #MadhyaPradesh #MadhyaPradeshNews pic.twitter.com/wUqKqJuJlE— HBTV News (@hbtv_in) June 4, 2025