Puri Jagannadh: ఈరోజుల్లో ఒక సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా కూడా వారందరి పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఒకరికే హీరోయిన్ పాత్రను ఇచ్చేసి మిగతా వాళ్లను సైడ్ క్యారెక్టర్స్ చేయకుండా అందరినీ లీడ్ రోల్స్‌గా ప్రకటిస్తున్నారు. త్వరలోనే పూరీ జగన్నాధ్ కూడా అదే చేయనున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాధ్ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తపన పడుతున్నారు. అదే సమయంలో తను ఎన్ని ఫ్లాప్స్‌లో ఉన్నా కూడా తనను నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఇక ఈ మూవీలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ఫైనల్ కాగా.. మరొక హీరోయిన్ కూడా లైన్‌లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆసక్తికర అప్డేట్స్
పూరీ జగన్నాధ్ (Puri Jagannadh), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో సినిమా అనగానే ముందుగా చాలామంది ప్రేక్షకులు షాకయ్యారు. అసలు పూరీ జగన్నాధ్‌కు చాలాకాలంగా హిట్స్ లేవు. ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద డిశాస్టర్లుగా నిలిచాయి. డైరెక్టర్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా పూరీ ఫెయిల్ అయ్యాడని ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు. అలాంటి ఫెయిల్యూర్ డైరెక్టర్‌ను నమ్మి విజయ్ సేతుపతి లాంటి బిజీ హీరో ఛాన్స్ ఇవ్వడమేంటి అని అందరూ అనుకున్నా తనకు కథ నచ్చిందని ఈ హీరో తేల్చిచెప్పాడు. అప్పటినుండి వీరి కాంబోలోని సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఫాలో అవుతున్నారు.
మూడో పేరు
ఇప్పటికే పూరీ, సేతుపతి సినిమాలో ఒక హీరోయిన్‌గా టబును ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఇందులో టబుది కీలక పాత్ర మాత్రమే అని విజయ్ సేతుపతి లీక్ చేసేశాడు. అయితే సేతుపతి సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేదానికి సమాధానంగా రాధికా ఆప్తే పేరు గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అలా టబు, రాధిక ఆప్తే ఇందులో హీరోయిన్లుగా కన్ఫర్మ్ అయ్యారని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆడియన్స్ అస్సలు ఊహించని మూడో పేరు తెరపైకి వచ్చింది. అది మరెవరో కాదు మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్.
Also Read: మాస్టర్ పీసా.? అప్పుడే డిసైడ్ చేశారా.? ముందు సినిమా సరిగ్గా తీయండి
నో కమర్షియల్ మూవీస్
మలయాళ ఇండస్ట్రీలో నటిగా పరిచయమయిన నివేదా థామస్ (Nivetha Thomas).. ఆపై ప్రతీ సౌత్ భాషలో తన సినిమాలతో అలరించింది. అయితే హీరోయిన్‌గా పరిచయమయినప్పటి నుండి తను నటించిన కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ. తన పాత్ర ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నప్పుడే తను సినిమాలను యాక్సెప్ట్ చేస్తూ వస్తోంది. అలా నివేదా చివరిగా నటించిన ‘35’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు తనను నటిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాంటి నివేదా థామస్‌ను ఎలాగైనా తన సినిమాలో తీసుకోవాలని పూరీ జగన్నాధ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.