Pushpa The Rule : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆర్య సినిమాతో వీరిద్దరి ప్రయాణం మొదలైంది. అల్లు అర్జున్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి అనే సినిమాను చేశారు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించింది కానీ పేరు మాత్రం అల్లు అర్జున్ కు రాకుండా రాఘవేంద్రరావుకి వచ్చింది. కానీ ఆర్య సినిమాకి సంబంధించి మంచి పేరును సాధించుకున్నాడు అల్లు అర్జున్. ఆ క్యారెక్టర్ ని సుకుమార్ డిజైన్ చేసిన విధానమే చాలా మందికి కొత్తగా అనిపించింది. ఇప్పటికీ చూసినా కూడా ఆర్య సినిమా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. సుకుమార్ డిజైన్ చేసిన క్యారెక్టర్స్ లో ఆర్య క్యారెక్టర్ కూడా బెస్ట్ అని చెప్పాలి.
Also Read : Virinchi Varma: నాని చెప్పడం వలన రాజమౌళితో యాక్టింగ్ చేయించాను.
ఈ సినిమా తరువాత వీరి కాంబినేషన్లో ఆర్య 2 సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయింది. సినిమా హిట్ కాకపోయినా కూడా ఇప్పటికీ ఆర్య 2 సినిమాకి సంబంధించి మంచి స్టేటస్ ఉంది అని చెప్పాలి. ఇక వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో వీరిద్దరూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ పుష్పరాజ్ క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు. ఈ సినిమాలోని డైలాగ్స్, మేనరిజమ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. చాలామంది పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఈ డైలాగులు చెప్పడం వలన ఈ సినిమాకి మరింత గుర్తింపు లభించింది.
ఇక వీరి కాంబినేషన్లో పుష్ప టు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇక డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చాలా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ తో పాటు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా తీసుకుంటారని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. లేకపోతే ఇప్పటివరకు సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ తప్ప ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేయలేదు. దేవి కూడా సుకుమార్ సినిమాలకి అద్భుతంగా సంగీతం అందిస్తాడు. మహేష్ బాబు హీరోగా చేసిన వన్ అనే సినిమాకి కేవలం నాలుగు రోజుల్లోనే ఆ సినిమా సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తం ఫినిష్ చేశాడు దేవి శ్రీ పసాద్. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే పుష్ప సినిమా విషయంలో కూడా అదే రిపీట్ చేస్తాడు అని కొంతమంది ట్రోలింగ్స్ కు కౌంటర్స్ వేస్తున్నారు.