Robinhood Movie: ఈరోజుల్లో సినిమా ప్రమోషన్స్ వీలైనంత వెరైటీగా చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. అందుకే ప్రమోషన్స్ కోసమే కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. అలా చాలా సినిమాలకు కొత్త రకమైన ప్రమోషన్స్ వల్లే బజ్ క్రియేట్ అయ్యింది. యంగ్ హీరో నితిన్ కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘రాబిన్‌హుడ్’ కోసం అలాంటి ప్రమోషన్సే చేయాలని ఫిక్స్ అయ్యాడు. తనకు వెంకీ కుడుములతో పాటు మిగతా టీమ్ కూడా యాడ్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను చాలా క్రియేటివ్‌గా అనౌన్స్ చేస్తున్న మేకర్స్.. తాజాగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అందులో రాజేంద్ర ప్రసాద్ దాదాపుగా ‘రాబిన్‌హుడ్’ స్టోరీని లీక్ చేసేశారు.
వెరైటీ ప్రమోషన్స్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. పైగా సినిమాకు సంబంధించిన షూటింగ్ మాత్రమే కాదు.. అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు లేట్ అవుతూనే ఉన్నాయి. అందుకే ఈ మూవీ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కాస్త తగ్గిపోయింది. కానీ ఆ ఇంట్రెస్ట్‌ను మళ్లీ క్రియేట్ చేయడం కోసం ప్రమోషన్స్‌ను చాలా వెరైటీగా ప్లాన్ చేశారు మేకర్స్. అందులో భాగంగా మూవీ టీమ్ మాత్రమే ఒక ఇంటర్వ్యూను ఏర్పాటు చేశారు. అందులో దర్శకుడు వెంకీ కుడుముల ఇంటర్వ్యూ తీసుకోగా నితిన్, రాజేంద్ర ప్రసాద్, శ్రీలీల, వెన్నెల కిషోర్ గెస్టులుగా వ్యవహరించారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
కోపంతో అలా చేశాడు
ఈ ప్రోమోలో ముందుగా ‘రాబిన్‌హుడ్’ (Robinhood)లో తమ క్యారెక్టర్స్ గురించి చెప్పమని అందరినీ అడిగాడు వెంకీ కుడుముల. అయితే క్యారెక్టర్స్ రాసింది తనే అని, అలా ఎలా మళ్లీ వాళ్లనే అడుగుతాడని అందరూ కామెడీ చేశారు. ‘‘నువ్వే నా కామం, నువ్వే నా కసి’’ అంటూ వెంకీపై ప్రేమను తన స్టైల్‌లో బయటపెట్టాడు నితిన్. అయితే తనపై కోపంతో తన క్యారెక్టర్ పేరును దారుణంగా పెట్టాడని, అది నచ్చలేదు కాబట్టి తన క్యారెక్టర్ పేరును ఏజెంట్ జాన్సన్‌గా మార్చేసుకున్నానని తెలిపారు రాజేంద్ర ప్రసాద్. ఇక శ్రీలీల తన పాత్ర గురించి చెప్తూ రియల్ లైఫ్‌లో కూడా తన యాటిట్యూడ్‌ను అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఒక మతిలేని ఓనర్‌కు, మతిలేని పీఏ అంటూ తన పాత్ర గురించి తెలిపాడు వెన్నెల కిషోర్.
Also Read: అవును ట్రాక్ తప్పాను.. ఇప్పుడు అలా కాదు.. ఆ కాన్ఫిడెంట్ ఏంటి బ్రో..
ఆస్ట్రేలియా అమ్మాయి
‘‘అమ్మాయి ఎక్కడో ఆస్ట్రేలియాలో పుడితే అక్కడి నుండి తీసుకొచ్చి ఈ పిల్లని..’’ అంటూ శ్రీలీల క్యారెక్టర్ గురించి చెప్పడానికి ప్రయత్నించారు రాజేంద్ర ప్రసాద్. కానీ కథ మొత్తం ముందుగానే లీక్ చేస్తున్నానని అనుకొని వెంటనే తనకు అలాంటి అలవాట్లు ఉన్నాయని చెప్పి వెంటనే గ్రహించి చెప్పడం ఆపేశారు. దీంతో శ్రీలీల క్యారెక్టర్‌పై ఆధారపడి సినిమా ఉంటుందని ప్రేక్షకులకు దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ‘రాబిన్‌హుడ్’ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇప్పటివరకు చేసిన ప్రమోషన్స్ చూస్తుంటే మూవీ టీమ్ అంతా దీని సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది.