Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత గేమ్ ఛేంజర్ తో ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు రామ్ చరణ్.. ఆ మూవీ భారీ బడ్జెట్ తో వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఆ సినిమాలతో పాటుగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ చెయ్యబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో రామ్ చరణ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీకి డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈ సినిమాకి ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. ఆ తరవాత నానితో ఓ ప్రాజెక్ట్ చేయాల్సివుంది. ఈలోగా రామ్ చరణ్ కోసం సుజిత్ ఓ కథ సిద్ధం చేస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్.. వీరిద్దరిలో కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ మేరకు చర్చలు నడుస్తున్నాయి. ‘ఓజీ’ రూపొందిస్తున్న ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్యనే ఈ చిత్రానికి నిర్మాతగా ఉండే అవకాశాలు ఉన్నాయి.. ఇప్పటికే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:మోదీ నెక్లేస్ లో నటి.. ఎవరో గుర్తు పట్టారా..?
రామ్ చరణ్ డేట్స్ ఇస్తాడా..?
సుజిత్ ఓజీ మూవీని త్వరలోనే పూర్తి చేసి విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట.. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేస్తారా? లేదా రామ్ చరణ్ తోనే సినిమా కోసం వెయిట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ తో బుచ్చిబాబుతో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో పెద్ది మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ వుంది. మధ్యలో త్రివిక్రమ్ – వెంకీ సినిమాలో కూడా నటించబోతున్నాడంటూ సంకేతాలు అందుతున్నాయి. అలా చరణ్ ఫ్రీ అయ్యేసరికి చాలా టైమ్ పట్టేట్టు వుంది. ఈలోగా నానితో సినిమా చేద్దామంటే తాను కూడా బిజీ. ప్రస్తుతం ‘పారడైజ్’ చేస్తున్నాడు. ఆ మూవీ అయిన తర్వాత సుజిత్ తో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి. నానితో సినిమా పూర్తి అయిన తర్వాతే రాంచరణ్ తో సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఆలోగా ఓజీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఆ మూవీ హిట్ అయితే మాత్రం డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..