BigTV English

Samantha’s 14 Years Journey: టాప్ హీరోయిన్.. ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. మయోసైటిస్.. సమంత 14 ఏళ్ల సినీ కెరీర్.. ఎంతో మందికి స్పూర్తి!

Samantha’s 14 Years Journey: టాప్ హీరోయిన్.. ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. మయోసైటిస్.. సమంత 14 ఏళ్ల సినీ కెరీర్.. ఎంతో మందికి స్పూర్తి!


Samantha Completed 14 Years in Film Industry: టాలీవుడ్‌లో 14 ఏళ్ల క్రితం గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో హీరోయిన్‌గా సమంత అరంగేట్రం చేసింది. నాగ చైతన్యకు జోడీగా నటించి జెస్సీగా తన నటనతో ఎనలేని గుర్తింపు సంపాదించుకుంది. జెస్సీ పాత్ర ఇప్పుటి కుర్రాళ్ల గుండెల్లో మెదులుతూనే ఉంటుంది.

ఆమె రెండు భాషల్లో సినిమాలు చేసినస్పటికీ తెలుగు చిత్రాలకే భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో సూపర్‌స్టార్‌ హోదాను పొందింది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరు టాప్‌ స్టార్స్‌తో నటించి అగ్ర నటిగా ఎదిగింది. తెలుగులో ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌, మహేశ్ బాబు వంటి అగ్ర హిరోలతో సమానంగా నటించి మెప్పించింది.


మెస్మరైజింగ్‌ పెర్ఫార్మెన్స్‌తో, ఆకర్షించే అందం ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. ఆమె ఎప్పుడూ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించింది. ‘శాకుంతలం’ వంటి పౌరాణిక సినిమాల్లో కూడా నటించి తనకు నటనపై ఉన్న ఆసక్తిని చూపించింది.

Read More: మోహన్ బాబు మాస్ వార్నింగ్.. నా పేరు రాజకయంగా ఉపయోగిస్తే..

రంగస్థలంలో డీగ్లామరస్‌ పాత్రను కూడా చేసి మెప్పించింది. పుష్పలో స్పెషల్‌ సాంగ్‌తో విమర్శలు కూడా ఎదురుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. నాగార్జున అక్కినేని లేకపోవడంతో ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో హోస్ట్‌గా కూడా చేసింది.

వ్యక్తిగత విషయానికి వస్తే.. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. ఆమెకు ఇటీవలే మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దానితో ఆమె చేసిన పోరాటం అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రత్యూష ఆర్గనైజేషన్‌తో పిల్లలకు, మహిళలకు సహాయం చేస్తుంది.

Read More: నటి రష్మిక సంచలన వ్యాఖ్యలు

ఆమె ఇటీవల ఒక సంవత్సరం విరామం నుంచి తిరిగి సెట్స్‌కి వచ్చి సినిమాలు ప్రారంభించింది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్‌ను ముగించింది. సినిమాల్లో తన కెరీర్‌లో 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×