BigTV English

Kalpana Rai: లేడీ కమెడియన్ కల్పనా రాయ్ అంత దీన స్థితిలో మరణించిందా.. చితికి కూడా డబ్బుల్లేక

Kalpana Rai: లేడీ కమెడియన్ కల్పనా రాయ్ అంత దీన స్థితిలో మరణించిందా.. చితికి కూడా డబ్బుల్లేక

Kalpana Rai: ఎన్ని జనరేషన్స్ మారినా.. జంబలకిడి పంబ అనే సినిమా మాత్రం ఎవరికైన గుర్తుండిపోతుంది. అందులో నటించిన కమెడియన్స్ ఇప్పుడు లేకపోయినా.. వారి కామెడీతో ప్రేక్షకుల మనస్సులో ఎప్పుడు జీవించే ఉంటారు. ఇక ఈ సినిమాలో పురుష్.. పురుష్ అంటూ మగవాళ్ల పేరు చెప్తేనే సిగ్గుపడిపోయే కల్పనా రాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.


ఇప్పుడంటే లేడీ కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ, అప్పట్లో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ. అందులో కల్పనా రాయ్ ఒకరు. చూడడానికి లావుగా ఉన్నా.. ఆమె ఎంత సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి. ఈ విషయం ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ నటులు బాహాటంగానే చెప్పుకొచ్చారు. కానీ, చివరిరోజుల్లో ఆమె ఎంతో దీన స్థితిలో మరణించింది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

కల్పనా రాయ్ .. మే 9, 1950న ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించింది. చిన్నతనం నుంచి తనకు నటనపై ఆసక్తి ఉండేది. ఆమె 1970లలో తన కెరీర్‌ను ప్రారంభించి 430కి పైగా చిత్రాలలో నటించింది. గోదావరి జిల్లాల యాసతో, ఆమె ఆకారంతో కామెడీని పండించింది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించింది. సినిమాల్లో నవ్వించడమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఆమె తన మంచి మనసుతో ఎంతోమందికి సహాయం చేసింది. అడిగినవారికి లేదనకుండా ఇచ్చేదట.


ఇక ఆ మంచితనమే ఆమెను ముంచేసింది. ఇస్తానని తీసుకున్నవారు కానీ, ఇచ్చినవారు లేరట. అలా ఆస్తి తిరిగిపోయింది. అయినా కూడా ఆమె దానమివ్వడం ఆపలేదు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఆమె ఒక అనాథను చేరదీసి కూతురుగా సాకింది. ఇక ఆమె పెద్దది అయ్యాక వేరే వ్యక్తిని ప్రేమించి అతడితో పారిపోయింది. ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. దాని వలనే ఆమె సగం కృంగిపోయింది. అలా ఆమె ఆరోగ్యం క్షిణీస్తూ వచ్చింది.

ఉన్న డబ్బు కూడా ఆవిరవడంతో పలకరించే వారు కూడా లేక అనాథలా మిగిలింది. ఇక 2008 వ సంవత్సరం లో హైదరాబాద్ లోని ఇందిరా నగర్ లో మృతి చెందింది చనిపోయేముందు పది రోజులపాటు తిండిలేక ఆకలితో అలమటించిందట. చివరికి ఆమె అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవట.. అంత దయనీయమైన పరిస్థితి ఏర్పడడంతో..మూవీ ఆర్టిస్ట్స్ అస్సోసియేషన్ ముందుకొచ్చి 10 వేల రూపాయిలు అంత్యక్రియల కోసం ఇవ్వడంతో ఆమె దహన సంస్కారాలు చేశారట. వింటుంటేనే కడుపు తరుక్కు పోతుంది కదా. ఎంతోమందికి ఆకలి తీర్చిన ఆమె చివరికి ఆ ఆకలితోనే మరణించింది.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×