BigTV English

Pa Pa Movie: తెలుగులో విడుదలకు సిద్ధమయిన తమిళ బ్లాక్‌బస్టర్ ‘డాడా’.. మరో యూత్‌ఫుల్ సినిమా రెడీ

Pa Pa Movie: తెలుగులో విడుదలకు సిద్ధమయిన తమిళ బ్లాక్‌బస్టర్ ‘డాడా’.. మరో యూత్‌ఫుల్ సినిమా రెడీ

Pa Pa Movie: కంటెంట్ బాగుంటే డబ్బింగ్ సినిమా అయినా ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలా తమిళంలో కంటెంట్‌తోనే బ్లాక్‌బస్టర్ సాధించిన సినిమా ఒకటి.. తెలుగులో విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘డాడా’. తమిళంలో ‘డాడా’ అనే టైటిల్‌తో ఫీల్ గుడ్ మూవీగా సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి విడుదలకు సిద్ధమయ్యింది. తెలుగులో డబ్ అయిన ఈ వర్షన్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికా, ఆస్ట్రేలియాలోని థియేటర్లలో కూడా భారీ ఎత్తున విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను తమిళంలో చూసిన ప్రేక్షకులు కూడా మరొకసారి తెలుగులో చూస్తే బాగుంటుందని ఫీలవుతున్నారు.


ఫారిన్‌లో విడుదల

తమిళంలో ‘డాడా’గా విడుదలయిన ఈ సినిమా.. తెలుగులో ‘పా.. పా..’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జేకే ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ ‘పా.. పా..’ మూవీ ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌లకు సిద్ధమయ్యింది. 2023లో ‘డాడా’ థియేటర్లలో విడుదలయ్యింది. కేవలం తమిళనాడు వరకే ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. కానీ ఓటీటీలో విడుదలయిన తర్వాత ఈ మూవీకి విపరీతమైన పాపులారిటీ లభించింది. చాలామంది ఈ మూవీని తమ ఫేవరెట్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నారు కూడా.


Also Read: తేజు బో** స్టేట్మెంట్.. అది లేకుండా ఉండటం కష్టమే…

వసూళ్ల వర్షం

గణేశ్ కే బాబు దర్శకత్వం వహించిన ‘డాడా’లో కవిన్, అపర్ణ దాస్ హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పటివరకు ఈ నటీనటుల గురించి తమిళ ప్రేక్షకులకు సైతం సరిగా తెలియదు. ముఖ్యంగా కవిన్ అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అని మాత్రమే వారికి తెలుసు. అలాంటిది ‘డాడా’లో కవిన్ పర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యి తను ఇలాంటి మరెన్నో సినిమాలు చేయాలని కోరుకున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘డాడా’ తమిళ డిస్ట్రిబ్యూట‌ర్లకు కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీ బడ్జెట్ ఎంతో పక్కన పెడితే.. రూ.30 కోట్లు వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

అన్ని ఎమోషన్స్‌తో

‘డాడా’ను ‘పాపా’గా తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత నీరజ కోట.. ఈ మూవీ ఇక్కడ కూడా మంచి హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. కామెడీ, ఎమోషన్స్, లవ్.. ఇవ‌న్నీ సమపాళ్లలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ డ్రామా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడం ఖాయ‌మ‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలిపారు. ఇప్పటికీ చాలామంది తెలుగు ప్రేక్షకులు సైతం ‘డాడా’ను ఒరిజినల్ వర్షన్‌లో చూసేశారు. అయినా కూడా తెలుగులో విడుదలయితే చూడడానికి సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ రెండో వారంలో ఎన్నో సినిమాలతో పాటు ‘పా.. పా..’ కూడా థియేటర్లలో

Tags

Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×