Venky Atluri: గత ఏడాది చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన లక్కీ భాస్కర్ ఊహించని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేయడంతో పాటు దుల్కర్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా వెంకీ అట్లురీ పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఇక తెలుగులో ట్రెండింగ్‌లో ఉన్న నయా డైరెక్టర్లలో జాబితాలో వెంకీ కూడా చేరిపోయాడు. ఇక తన తదుపరి చిత్రంపై సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే వెంకీ మాత్రం గతంలో తనకు భారీ హిట్ కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరో సారి హిట్ కాంబో రిపీట్
సార్ మూవీ విడుదలై ఎంత పెద్ద హిట్ అందరికీ తెలిసిందే. అటు ధునుష్‌తో పాటు ఇటు వెంకీ అట్లూరికి కూడా వాళ్ల కెరీర్ పరంగా బిగ్ హిట్‌గా నిలిచింది. ఇక ధనుష్ కి కూడా విఐపీ మూవీ తర్వాత తెలుగులో భారీ హిట్‌ని అందించింది. ఇటీవల లక్కీ భాస్కర్ భారీ సక్సెస్ తర్వాత వెంకీ అట్లూరి తన తర్వాత చిత్రం తెలుగు హీరోలతో మూవీ ఉంటుందని అందరూ ఊహించారు. అయితే అందరికీ షాక్కిస్తూ మరో సారి సార్ మూవీ కాంబినేషన్‌తో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఇటీవల నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వెంకీ అట్లూరి తన తర్వాత మూవీ మా బ్యానర్‌లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.
అప్పుడే పనులు మొదలు
ధనుష్, వెంకీ అట్లూరి (Venky Atluri) మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరో వైపు ఇటీవల సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పేరు మీద ఫిల్మ్ ఛాంబర్‌లో ‘హానెస్ట్ రాజు’ అనే సినిమా టైటిల్ రిజిస్టర్ అయ్యింది. సార్ మూవీ కాంబో కోసమే ఈ టైటిల్ అంటూ టాలీవుడ్‌లో టాక్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో పుల్ బిజీగా ఉన్నాడు ధనుష్. స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న ధనుష్‌ని ఇతర దర్శకులు ఒప్పించడం అంత ఈజీ విషయం కాదు అనే టాక్ ఉంది. అలాంటిది వెంకీ అట్లూరి ఏకంగా రెండో సినిమాను ధనుష్‌తో చేస్తున్నారంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
Also Read: ఆ విషయం నాకు కూడా తెలియదు.. విజయ్ సేతుపతిని షాక్‌కు గురిచేసిన విజయ్..
వెరీ బిజీ
ప్రస్తుతం ధనుష్ (Dhanush) ‘కుబేరా’ సినిమాను ఈ వేసవిలో ఆడియన్స్‌కు ముందుకు వచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కుబేరా సినిమాలో ధనుష్‌తో పాటు తెలుగు సీనియర్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలో నటించడంతో పాటు, పుష్ప స్టార్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.