Leo Movie: మామూలుగా సినిమాలకు, సినీ సెలబ్రిటీలకు లీగల్ సమస్యలు అనేవి సహజం. ఏదో ఒక చిన్న విషయాన్ని కారంణంగా చూపించి ఏదో ఒక విధంగా మేకర్స్‌ను ఇబ్బందిపెడుతుంటారు. అలాగే తమిళంలో దళపతిగా పేరు తెచ్చుకున్న విజయ్ (Vijay)కు కూడా ఈ సమస్యలు తప్పలేదు. రెండేళ్ల క్రితం విజయ్ హీరోగా నటించిన ‘లియో’ (Leo) సినిమా వల్లే ఇదంతా జరిగింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన సినమానే ‘లియో’. ఈ మూవీ 2023లో విడుదలయ్యి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు లీగల్ సమస్యలను ఎదుర్కుంటోంది. అయినా ఇందులో మేకర్స్‌కు ఊరట లభించింది.
అవన్నీ నచ్చలేదు
లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) సినిమా అంటే ఎలా ఉంటుందో దాదాపు యూత్ అందరికీ ఐడియా ఉంటుంది. ఇప్పటివరకు తను దర్శకత్వం వహించిన సినిమాలు దాదాపుగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లోనే ఉంటాయి. ‘లియో’ కూడా అంతే. కానీ ఇంతకు ముందు లోకేశ్ తెరకెక్కించిన ఏ సినిమాకు రాని సమస్య.. ‘లియో’కు ఎదురయ్యింది. మధురైకు చెందిన రాజమురుగన్ ఈ మూవీపై కోర్టులో పిటీషన్ వేశారు. ఇందులో ఎక్కువగా వైలెన్స్‌ను చూపించారని ఆయన పిటీషన్‌లో పేర్కొన్నారు. పైగా ఆయుధాలను ఉపయోగించడం మంచిదే అన్నట్టుగా చూపించారని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా గురించి ఆయనకు నచ్చని చాలా విషయాలు పిటీషన్‌లో పేర్కొన్నారు.
ఓటీటీ నుండి తీసేయండి
‘లియో’లో సమాజానికి భంగం కలిగించే సీన్స్ ఉన్నాయని రాజమురుగన్ పేర్కొన్నారు. వైలెన్స్‌లో ఆడవారిని, పిల్లలను టార్గెట్ చేసే విధంగా సీన్స్ ఉన్నాయని అన్నారు. అంతే కాకుండా గొడవల సమయాల్లో తమ ఆలోచనలను చెప్పుకోవడం కోసం పలు మతాలకు సంబంధించిన జెండాలను సినిమాలో ఉపయోగించారని తెలిపారు. చట్టరీత్యా నేరమైన పనులు, డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాలు వాడకం, క్రిమినల్ ప్రవర్తన.. ఇలాంటివన్నీ సినిమాలో ఉన్నాయని రాజమురుగన్ పేర్కొన్నారు. అందుకే ఈ మూవీని వెంటనే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ నుండి తీసేయడమే కాకుండా లోకేశ్ కనకరాజ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ అయింది… అల్లు అర్జున్ అరెస్ట్‌పై ‘మా’ ప్రెసిడెంట్..
పబ్లిసిటీ కోసమే
మద్రాస్ హై కోర్టు ఇరువురి వాదనలు విన్న తర్వాత ‘లియో’పై రాజమురుగన్ ఫైల్ చేసిన పిటీషన్‌ను కొట్టేసింది. ఇది తను కేవలం పబ్లిసిటీ కోసమే చేశాడంటూ తోసిపుచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటీషన్‌లో సరైన ఆధారాలు లేవని, పైగా దీనిపై లీగల్ యాక్షన్ తీసుకునేంత సీరియస్ మ్యాటర్ లేదని కోర్టు భావించింది. ఆపై పిటీషన్‌పు వెంటనే వెనక్కి తీసుకోమంటూ రాజమురుగన్ చేసిన పనికి పెనాల్టీ వేసింది. సెన్సార్‌షిప్ ఇచ్చిన దానిప్రకరమే ‘లియో’ రన్ అయ్యిందని, ఇప్పటికీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా అలాగే కొనసాగుతుందని తెలిపింది. దీంతో ‘లియో’ సినిమా మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఫైల్ అయిన పిటీషన్‌ను ఎదిరించి గెలిచింది. ఈరోజుల్లో కొందరు కావాలనే సినిమా వాళ్లను టార్గెట్ చేసి వారిపై అనవసరమైన కేసులు పెడుతున్నారని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.