Saif Ali Khan Attack | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసులో పోలీసులు తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. దాడి ఘటన ఎలా జరిగిందో వివరించారు. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలో జరిగిన దాడిలో తీవ్రంగా బాలీవుడ్ ప్రముఖ నటుడు తీవ్రంగా గాయపడ్డారు. మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అనే అక్రమ బంగ్లాదేశీ వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేయడంతో, సైఫ్ వెన్నులో 6 చోట్ల గాయాలయ్యాయి. ఈ ఘటనలో కత్తి ముక్క 2.5 అంగుళాల లోతుగా వెన్నెముకలో విరిగి ఇరుక్కుపోయింది. సైఫ్‌ను వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించి, శస్త్రచికిత్స ద్వారా కత్తి ముక్కను వైద్యులు తొలగించారు. మంగళవారం సైఫ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
దాడి వివరాలు
సైఫ్‌పై దాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు షరీఫుల్ ఇస్లాం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ నివసిస్తున్న బిల్డింగ్ లోకి దొంగచాటుగా ప్రవేశించాడు. ఆ తరువాత డక్ట్ పైపుల సాయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడ దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో నలుగురు పురుషులు, ఒక మహిళా పనిమనుషులు ఉన్నారు. వారిలో నలుగురు పరుషులు దొంగ చేతిలో కత్తి చూసి వారి గదుల్లోకి వెళ్లి దాక్కున్నారు. కానీ మహిళ పనిమనిషి కేకలు వేయగా.. సైఫ్ అలీ ఖాన్ తన గది నుంచి బయటికి వచ్చారు.
దొంగను చూసి వెంటనే ఇంటిని లోపలి నుంచి లాక్ చేశారు. ఆ తరువాత దొంగ పారిపోకుండా అతడిని ముందు నుంచి గట్టిగా పట్టకున్నారు. సైఫ్ పట్టుకోవడంతో, నిందితుడు తప్పించుకునే క్రమంలో సైఫ్ వీపులో కత్తితో పొడిచాడు. దీంతో సైఫ్ వెన్ కత్తి విరిగి కత్తి ముక్క ఉండిపోయింది. ఆ తరువాత కూడా దొంగ సైప్ చేతులు, పొట్ట, ఛాతి భాగాలలో కత్తితో దాడి చేశాడు.
Also Read: సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్
అనంతరం నిందితుడు (దొంగ) బాత్రూమ్ కిటికీ ద్వారా బయటకు పారిపోయి, భవనం గార్డెన్‌లో రెండు గంటల పాటు దాక్కున్నాడు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అందరూ నిద్రపోతుండడంతో, నిందితుడు భవనంలోకి ప్రవేశించడంలో సులభతరమైందని పోలీసులు తెలిపారు.
పోలీసులు షరిఫుల్ ఇస్లాంని సిసిటీవి వీడియోలు పరిశీలించి, అతడి ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం బంగ్లాదేశ్ పౌరుడని.. బతుకుతెరువు కోసం భారతదేశంలో అక్రమంగా మేఘాలయ రాష్ట్రం మార్గంలో ప్రవేశించాడని విచారణలో తేలింది. అతన గత కొన్ని నెలలుగా ముంబై నగరంలో చిన్న చిన్న లేబర్ పనులు చేసేవాడని తెలిసింది. అయితే త్వరగా డబ్బు సంపాదించేందుకు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని పోలీసుల విచారణలో అతను అంగీకరించాడు. దొంగతనం చేయడానికి వెళ్లినప్పుడు ఆ ఇల్లు నటుడు సైఫ్ అలీ ఖాన్ కు చెందినదిగా తనకు తెలియదని చెప్పాడు.
వేల కోట్ల ఆస్తి ఉన్న సైఫ్ అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్, పటౌడీ కుటుంబానికి చెందిన వారసుడిగా ఎంతో ఆస్తిని కలిగి ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న పటౌడీ ప్యాలెస్ అత్యంత విలువైన ఆస్తులలో ఒకటి. అయితే, ఈ ఆస్తులపై 2015 నుండి కోర్టు స్టే కొనసాగుతుండగా, తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ స్టేను ఎత్తివేసింది. దీంతో ఆయనకు చెందిన విలువైన ఆస్తులు ఇప్పుడు కేంద్రం స్వాధీనం చేసుకోనుంది. దీనిపై ఆయన న్యాయపోరాటం చేయనున్నారని సమాచారం.