E-Paper
Advertisement

ఐరోపాలో కరిగిపోతున్న రోడ్లు.. 1000 మంది పైగా మృతి

ఐరోపాలో కరిగిపోతున్న రోడ్లు.. 1000 మంది పైగా మృతి
Advertisement

Europe Heatwave: గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం యూరప్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ ఖండంలోని సగానికి పైగా దేశాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇంట్లో ఉక్కపోతకు తట్టుకోలేక పార్కులు, స్విమ్మింగ్ ఫూల్స్‌ని వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక ఒక్క ఫ్రాన్స్‌లో దాదాపు 1000 మంది మృతి చెందారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూరప్

Advertisement

వేడిగాలులతో ఐరోపా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దశాబ్దాల నాటి ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలవుతున్నాయి. తీవ్రమైన వేడి కారణంగా దాదాపు 1,000 మంది ఫ్రాన్స్‌లో మృతి చెందినట్టు అక్కడి మీడియా చెబుతోంది. ఈ మరణాలు కేవలం మూడు రోజుల్లో చోటు చేసుకున్నాయి. జూన్ 24- 27 మధ్య జరిగింది. ఇక పారిస్ గురించి చెప్పనక్కర్లేదు. పరిసర ప్రాంతాల మృతుల్లో వృద్ధులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జర్మనీ, స్పెయిన్, బ్రిటన్, డెన్మార్క్, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల గురించి చెప్పనక్కర్లేదు. ఎండవేడిమి తాళలేక పార్కులు, పాడ్ల మధ్య సేదతీరుతున్నారు. ఎప్పుడూ చల్లగా ఉండే యూరప్‌లో ఈ స్థాయిలో ఎండలు నమోదు కావడంతో అక్కడి ప్రజలకు అంతుబట్టడం లేదు. ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలంటూ చర్చించుకోవడం మొదలైంది.

Advertisement

ఫ్రాన్స్‌లో వెయ్యి మంది మృతి, కరిగిపోతున్న రోడ్లు, రైలు పట్టాలకు తప్పని ఇబ్బందులు

యూరప్‌ అంతటా దాదాపు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఫలితంగా ఫ్రాన్స్‌లోని రోడ్లు కరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. గాడ్జిల్లా ఎల్ నినోతోడు అనేక ప్రాంతాలల కార్చిచ్చు కూడా ఈ తీవ్రతు కారణంగా చెబుతున్నారు అధికారులు. ప్రపంచ సగటు కంటే యూరప్‌లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయన్నది శాస్త్రవేత్తల మాట.

ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బ్రిటన్ చరిత్రలో తొలిసారి. మూడురోజుల పాటు రెడ్ వార్నింగ్ హెచ్చరికలు జారీ చేశారు అక్కడి అధికారులు. బ్రిటన్‌ వ్యాప్తంగా 1000 కి పైగా పాఠశాలలు మూతబడ్డాయి. ఉష్ణోగ్రతల కారణంగా చివరకు ఇనుప రైలు పట్టాలు వంగిపోయే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

ALSO READ: చైనాలో భూకంపం.. వణికిన సిచువాన్ ప్రావిన్స్‌, ప్రాణ, ఆస్తి నష్టానికి 

జర్మనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా రైళ్లపై వేగాన్ని గంటకు 60 మైళ్లకు తగ్గించాల్సి వస్తోందని చెబుతున్నారు అధికారులు. ట్రామ్ ట్రాక్‌లు వంగిపోవడంతో రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్‌లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అటు బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిపోయాయి.

ప్రతిరోజూ నమోదయ్యే సాధారణ మరణాలకు ఇవి అదనమని ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. తూర్పు ప్రాంతమైన కూబ్‌షూట్స్‌లో రికార్డు స్థాయిలో రాత్రి వేళ 29.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మోకెర్న్‌ డ్రీవిజ్‌లో 41.5 డిగ్రీల సెల్సియస్‌ పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Related News

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

వరద గుప్పిట్లో బ్యాంకాక్ సిటీ.. 48 గంటల్లో 300 మి.మీ. వర్షం, విమానాల గురించి..

రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

Big Stories

Advertisement
×