Fire accident: మలేషియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని కౌలాలంపూర్ సమీపంలోని సెలంగోర్ పుత్రా హైట్ లో ఓ పెట్రోల్ పంపు వద్ద భారీ గ్యాస్ పైప్ లైన్ పేలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇందులో కొంత మందికి తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల స్థానికులు ఒక్కసారిగా భయానికి లోనై అక్కడ నుంచి పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటేనే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. చుట్టుపక్కల నివాస ప్రాంతంలో ఉన్న ప్రజలను వెంటనే అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయించారు. గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
గ్యాస్ పైప్ లైన్ కావడంతో భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి. అంటే ప్రమాదం ఏం రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో భారీ ఎత్తున ఎగిసిపడుతున్న అగ్ని పుట్టగొడుగు మేఘం ఆకారంలో మంటలు కనిపించాయి. ఈ ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వాన్ మొహమ్మద్ రజాలి వాన్ ఇస్మాయిల్‌య స్పందించారు.
ఈ రోజు ఉదయం 8:10 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుందని, పైప్‌లైన్‌లో 500 మీటర్ల పొడవునా భారీ ఎత్తులో మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన కొంత సమయం తర్వాత పైప్ లైన్ ను వేరు చేశామని పెట్రోనాస్ సంస్థ వెల్లడించింది. మండుతున్న పైప్‌లైన్‌లోని వాల్వ్ ను మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నివాస ప్రాంతంలో మంటలు ఎంతవరకు వ్యాప్తి చెందాయో ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
బెర్నామా వార్తా సంస్థకు సెలంగోర్ డిప్యూటీ పోలీస్ చీఫ్ మొహమ్మద్ జైని అబు హసన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘49 ఇళ్లు దెబ్బతిన్నాయి. 112 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇందులో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్వాసకోశ సమస్యలు, భారీ గాయాల కారణంగా క్షతగాత్రులు ఆస్పత్రిలో చేర్చాం’ అని ఆయన అన్నారు. సెలంగోర్ ముఖ్యమంత్రి అమిరుద్దీన్ షరీ, ముందు జాగ్రత్తగా సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించి, స్థానిక మసీదులలో తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
UPDATE: At least 112 people injured after gas pipeline explodes in Malaysia https://t.co/yYBn1nJ5le
— BNO News Live (@BNODesk) April 1, 2025
ALSO READ: Nityananda ranjitha: రంజిత ప్రేమలో నిత్యానంద.. అసలు వీరి మధ్య ఏం నడిచింది? ఆ వీడియోలో ఏం ఉంది?
ALSO READ: Massive explosion: గుజరాత్‌లో భారీ పేలుడు.. 17 మంది స్పాట్‌లో మృతి..