BigTV English

Kim Jong Un Supports Putin: రష్యా వెంటే ఉత్తర కొరియా.. పుతిన్‌కు మద్దతు ప్రకటించిన కిమ్

Kim Jong Un Supports Putin: రష్యా వెంటే ఉత్తర కొరియా.. పుతిన్‌కు మద్దతు ప్రకటించిన కిమ్

Kim Jong Un Supports Putin| ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా నుంచి తిరుగులేని మద్దతు లభించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్  తన మద్దతు రష్యాకేనని తెలిపారు. ఈ మేరకు  స్థానిక మీడియా  కథనాలు వెల్లడించింది. పుతిన్ సైన్యాల తరఫున పోరాడేందుకు కిమ్ రెండోసారి కూడా కొంతమంది సైనికులను పంపి ఉంటుందని దక్షిణ కొరియా నిఘా విభాగం అంచనా వేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.


కిమ్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సెర్గీ షోయిగు మధ్య జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించుకున్నారు. రష్యా తన సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కిమ్ స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని పుతిన్ పంపిన సందేశాన్ని షోయిగు వినిపించారు.

Also Read: 5 లక్షల మంది అమెరికా వదిలి వెళ్లిపోవాలి.. వారికి భారీ షాకిచ్చిన ట్రంప్


గత ఏడాది రష్యాలో కిమ్, ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించిన సంగతి తెలిసిందే. 24 ఏళ్లలో తొలిసారిగా ఉత్తర కొరియాలో ఓ రష్యా అధ్యక్షుడు పర్యటించారు. పాశ్చాత్య దేశాల నుంచి తమ రెండు దేశాలలో ఎవరిపై దాడి జరిగినా పరస్పర సహాయం చేసుకుంటామని ఆ సమయంలో ఇద్దరు నేతలు నిర్ణయించారు. అయితే, ఏ రకమైన సహాయం అందించబడుతుందనే విషయం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ అని మాత్రమే పేర్కొన్నారు.

ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా 30 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించగా, రష్యా సూత్రప్రాయంగా అమోదించింది. ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఈ చర్చల్లో నిర్ణయించుకున్నారు. దీని అమలు దిశగా ఆదివారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు ప్రారంభం కానున్నట్లు యూఎస్ అధికారి తెలిపారు.

ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధంలో భాగంగా రష్యాకు ఉత్తర కొరియా భారీ సంఖ్యలో సంప్రదాయ ఆయుధాలను, 10 నుంచి 12 వేల మంది వరకు సైనికులను పంపిందని పాశ్చాత్య మీడియా గతంలో వెల్లడించింది.

ట్రంప్ కోసం ప్రార్థనలు చేసిన పుతిన్

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా ఉన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. రష్యాకు అనుకూలంగానే ఆయన ప్రకటనలు, నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ సమయంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఆయన స్నేహం గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది.

గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉండగా 20 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి స్వల్పంగా గాయమైంది. వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా భద్రతా సిబ్బంది చేరి.. వేదికపై నుంచి దించి ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటన అప్పట్లో సంచలనమైంది. ఆ విషయం తెలుసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ‘‘పుతిన్ స్థానిక చర్చ్‌కు వెళ్లి, మత గురువును కలిసి, అధ్యక్షుడి కోసం ప్రార్థించారు. అధ్యక్షుడు ట్రంప్ తో పుతిన్‌కు స్నేహం ఉంది. స్నేహితుడి కోసం ఆయన ప్రార్థించారు. ఇదే విషయాన్ని నేను ట్రంప్‌కు చెప్పాను. పుతిన్ చర్య ఆయన హృదయాన్ని హత్తుకుంది’’ అని అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కోఫ్ ఓ పాడ్‌కాస్ట్‌లో భాగంగా వెల్లడించారు.

గత ఏడాది ట్రంప్‌పై వరుసగా జరిగిన హత్యాయత్న ఘటనలపై పుతిన్ స్పందించారు. ‘‘అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారు. ఆయన కుటుంబాన్ని మరియు పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించింది. పలుమార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరం. నా అంచనా ప్రకారం, ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు. అయితే ఆయన తెలివైన వ్యక్తి. ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా’’ అని పుతిన్ అన్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×