BigTV English

Navy Drills : సముద్రంలో శత్రువులంతా కలిశారా.? – హిందూమహా సముద్రంలో సైనిక విన్యాసాలు

Navy Drills : సముద్రంలో శత్రువులంతా కలిశారా.? – హిందూమహా సముద్రంలో సైనిక విన్యాసాలు

Navy Drills : అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ తో యుద్ధంతో రష్యా ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇజ్రాయిలపై ఇస్లాం ఉగ్ర సంస్థ హమాస్ కు మద్ధతుగా నిలవడం, అణు కార్యక్రమాన్ని తీవ్ర తరం చేయడం ద్వారా ఇరాన్.. అమెరికా, పాశ్చాత్య దేశాలతో విభేధాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వివాదాస్పద దేశాలతో చైనా జట్టు కట్టింది. ఇరాన్ సమీపంలో ఇరాన్, రష్యాతో కలిసి సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించనుంది. ఈ విన్యాసాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) నేవీ ఒక డిస్ట్రాయర్, ఒక రిప్లిఫిన్ షిప్‌ తో పాల్గొంటుందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన షిప్పింగ్ ప్రాంతంలో భద్రతను కాపాడే ఉద్దేశ్యంతో ఈ డ్రిల్ చేపట్టినట్లు చైనా ప్రకటించింది.


ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయానికి సమీపంలో మార్చి మధ్యలో ఈ విన్యాసాలు ప్రారంభం కానుండగా.. చైనా, ఇరాన్, రష్యా నావికాదళాలు సెక్యూరిటీ బెల్ట్-2025 పేరుతో ఉమ్మడి విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ డ్రిల్‌లో సముద్ర లక్ష్య దాడి, VBSS, నష్ట నియంత్రణతో పాటు ఉమ్మడి శోధన, రెస్క్యూ ఆపరేషన్‌లతో సహా శిక్షణా కోర్సులు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో పాల్గొనే మూడు దేశాల దళాల మధ్య సైనిక పరస్పర విశ్వాసం, ఆచరణాత్మక సహకారాన్ని మరింతగా పెంచడం దీని లక్ష్యం అని తెలిపారు. ఇరాన్ కి ఆగ్నేయ ఓడరేవు నగరంగా ఉన్న చాబహార్ తీరంలో హిందూ మహాసముద్రంలో ఉమ్మడి విన్యాసాలు నిర్వహించనున్నారు.

ఈ విన్యాసాల్ని అజర్ బైజాన్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా, ఒమన్, కజికిస్తాన్, పాకిస్తాన్, ఖతార్, ఇరాక్, యూఏఈ, శ్రీలంక పరిశీలకులు పర్యవేక్షిస్తారని తెలిపారు. సెక్యూరిటీ బెల్ట్ విన్యాసాలు 2019 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న విన్యాసాలు ఐదో చైనా-ఇరాన్-రష్యా ఉమ్మడి నావికా విన్యాసాలు అని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. వాణిజ్యం, సైనిక రంగాల్లో సహకారం పెంపొందించేందుకు ఈ ఏడాది జనవరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ కౌంటర్ మస్ౌద్ పెజెష్కియన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది.


ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్ భూతలంపై ఇజ్రాయిల్ భీకర దాడుల తర్వాత.. సొంతంగా అణ్యాయుధాలు తయారు చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దాంతో.. ఆగ్రహించిన అమెరికా ఇరాన్ చమురు కార్యకలాపాలపై తీవ్ర స్థాయి అంక్షలు విధించింది. ఆ దేశాన్ని ఆర్థికంగా నష్టపరిచేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీంతో.. ఇరాన్ – అమెరికా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఇలాంటి తరుణంలో కీలకమైన హిందూ మహాసముద్రంలో సైనిక విన్యాసాలు అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని అమెరికా సహా ఇజ్రాయిల్, ఉక్రెయిన్ దళాలలతో పాటుగా.. చైనా పాల్గొంటున్నందున భారత్ సైతం జాగ్రత్తగా పరిశీలించనుంది.

Also Read : US Deportation : ఖర్చు మోయలేం – సైనిక విమానాలు వద్దులే అంటున్న అమెరికా

కాగా.. మరోవైపు ఇరాన్ తో దూరం దూరం జరుగుతున్న అమెరికా.. మరిన్ని ఆంక్షలు కోరుతోందని శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ దూరం జరుగుతోంది. అమెరికా మీడియా, డోనాల్డ్ ట్రంప్ మాత్రం.. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారని తెలిపారు. ఆ వెనువెంటనే.. ఇలాంటి సైనిక విన్యాసాలకు సంబంధించిన వార్తలు, ప్రకటనలు రావడంతో.. మిగతా దేశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

Related News

Mount Everest: ఎవరెస్ట్‌పై మంచు తుపాను ప్రతాపం.. మూసుకుపోయిన దారులు, చిక్కుకుపోయిన 1000 మంది

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Singapore News: ఇద్దరు భారతీయ టూరిస్టులకు సింగపూర్ కోర్టు షాక్.. హోటల్ గదుల్లో వారిని పిలిచి

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

Big Stories

×