E-Paper
Advertisement

Ind vs nz: కోహ్లీ, రోహిత్ దాండియా….చిన్న పిల్లాడిలా సునీల్ గవాస్కర్ స్టెప్పులు !

Ind vs nz:  కోహ్లీ, రోహిత్ దాండియా….చిన్న పిల్లాడిలా సునీల్ గవాస్కర్ స్టెప్పులు !
Advertisement

Ind vs nz: ఛాంపియన్స్ ప్రొఫెసర్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచింది. న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా… ఛాంపియన్ గా అవతరించింది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌండరీ కొట్టి…. జట్టును గెలిపించాడు. ఈ తరుణంలోనే… టీమిండియా…. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ట్రోఫీని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్ల హడావిడి అంతా కాదు. అందరూ చిన్నపిల్లాడిలా… గ్రౌండ్ లో ఎంజాయ్ చేశారు.

Also Read:  IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా… ప్రైజ్ మనీ ఎంతంటే ?

Advertisement

అందరికంటే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కూడా… గ్రౌండ్లో చిందులు వేసిన వీడియోలు వైరల్ గా మారాయి. రెండు వికెట్లు పట్టుకొని… దాండియా కూడా ఆడారు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలు అలాగే ఫోటోలు చూసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి సాధించార్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీమిండియా ప్లేయర్ లందరూ చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పట్టుకొని ఫోటోలు… దిగుతున్న సమయంలో… టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా రచ్చ చేశాడు. ఆయన కూడా చిన్న పిల్లాడిలా మారిపోయారు. కామెంట్రీ చేయకుండా… గ్రౌండ్లో చిందులు వేస్తూ కనిపించారు. టీమిండియా గెలిచింది… మనకు తిరుగులేదు అంటూ… సునీల్ గవాస్కర్ డాన్స్ వేయడం జరిగింది. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక వీళ్ళ వీడియోలు చూసిన టీమిండియా ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 2013 తర్వాత.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలిస్తే… ఆ మాత్రం డాన్సులు చేయాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాంపియన్ ట్రోఫీ పూర్తికాగానే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తానని అందరూ అన్నారు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మ… టి20 క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా… అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్తారని కూడా ప్రచారం చేశారు. కానీ ఇప్పటివరకు దీనిపై ఈ ఇద్దరు క్రికెటర్లు ఎక్కడా స్పందించలేదు. అయితే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం… రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా… టీమిండియా… నిలిచింది. అదే సమయంలో న్యూజిలాండ్ టీం రన్నరప్ జట్టుగా నిలిచింది. చివరి వరకు పోరాడి ఓడిన న్యూజిలాండ్ కు… సపోర్ట్ గా కూడా టీమిండియా ఫ్యాన్స్ నిలుస్తున్నారు.

Advertisement

Also Read:  Glenn Phillips: ఇదేం క్యాచ్ రా… జాంటీ రోడ్స్ ను మించిపోయిన గ్లెన్ ఫిలిప్స్!

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×