ఒకప్పుడు అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్లిన జపాన్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజు రోజు ఆదేశ కరెన్సీ బలహీనపడటంతో పాటు పేదరికం పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని టోక్యోలోని యువతులు డబ్బు సంపాదనకు కొత్తమార్గాలను వెతుకుతున్నారు. పెద్ద సంఖ్యలో వ్యభిచారం వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా విడుదలైన ‘ది స్టార్’ నివేదిక పలు సంచలన విషయాలను వెల్లడించింది. టోక్యోలో ఏకంగా 260 క్లబ్ లలో వ్యభిచార కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తన రిపోర్టులో తెలిపింది.
పేదరికం కారణంగా ఆ వృత్తిలోకి..
జపాన్ లో పేదరికం పెరుగుతున్న నేపథ్యంలోనే యువతులు వ్యభిచారంలోకి వెళ్తున్నారని లైసన్ కౌన్సిల్ ప్రొటెక్టింగ్ యూత్స్ (సీబోరెన్) సెక్రటరీ జనరల్ యోషిహిడే తనకా వెల్లడించారు. ఇతర దేశాలతో పోల్చితే చైనా నుంచి చాలా మంది యువకులు టోక్యోకు వస్తున్నారని చెప్పారు. ఇక్కడికి వచ్చే చాలా మంది యువకులు అమ్మాయిలతో కలయిక కోసమే వస్తున్నట్లు తెలిపారు. కరోనా ఆంక్షల తర్వాత చైనా నుంచి టోక్యోకు వస్తున్న యువకుల సంఖ్య బాగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. 15 ఏండ్ల యువతుల నుంచి మొదలుకొని 25 ఏండ్లలోపు అమ్మాయిలు ఎక్కువగా వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యువతులు విటుల నుంచి హింసను ఎదుర్కొంటున్నట్లు తనకా వెల్లడించారు. టోక్యోలో చాలా హోటళ్లతో పాటు పార్కులలోనే లైంగిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. దేశ రాజధానిలోని ఓకుబో లాంటి పార్కుల్లోనే ఆ పనులు కానిచ్చేస్తున్నట్లు చెప్పాయి.
చట్టసభల్లో ప్రతి పక్షనాయకుల ఆగ్రహం
టోక్యోలో రోజు రోజుకు వ్యభిచార కార్యక్రమాలు పెరిగిపోవడం పట్ల చట్ట సభల్లో ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “జపాన్ కు వచ్చే విదేశీ పురుషులు ఇక్కడి యువతులను లైంగిక అవసరాల కోసం ఉపయోగపడే బొమ్మలుగా చూస్తున్నారు. ఇలాంటి ఆలోచన వల్ల అంతర్జాతీయ సమాజంలో జపాన్ మహిళల ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుంది” జపాన్ ప్రధాన ప్రతిపక్ష నేత కజునోరి యమనోయి ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకేసారి 140 మంది యువతుల అరెస్ట్
గత ఏడాది ఓకుబో పార్కులలో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 140 మంది యువతులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ పార్కులో పోలీసుల గస్తీ పెంచారు. అంతేకాదు, అరెస్ట్ అయిన వారిలో 43 శాతం మంది మహిళలు క్లబ్బులలో వ్యభిచారం నిర్వహించేవారేనని గుర్తించారు. వయసు పరంగా చూస్తే 80 శాతం మంది 20 ఏళ్లలోపు వారు కాగా, ముగ్గురు 19 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు, టోక్యోలో ఏకంగా 260 క్లబ్ లలో ఈ కార్యక్రమాలు కొనసాగున్నట్లు వెల్లడించారు. గంటల చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.
యువతులపై పెరుగుతున్న హింస
వ్యభిచారంలోకి దిగుతున్న యువతులపై హింస పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ గురించారు. అంతేకాదు, సుఖరోగాల బారినపడుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి జపాన్ లో వ్యభిచారం అనేది నేరం. వ్యభిచార నిరోధక చట్టం ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంది. అయినప్పటికీ యువతులు వ్యభిచారంలోకి దిగుతున్నారు.
Read Also: మూడో ప్రపంచ యుద్ధం.. బాబా వంగా, నోస్ట్రాడమస్ చెప్పింది ఇదే, మీరు సిద్ధమేనా?