E-Paper
Advertisement

ట్రంప్ సర్కార్‌కు ఝలక్.. జన్మహక్కు పౌరసత్వం వ్యవహారం, సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్రంప్ సర్కార్‌కు ఝలక్.. జన్మహక్కు పౌరసత్వం వ్యవహారం, సుప్రీంకోర్టు కీలక తీర్పు
Advertisement

America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. జన్మతః పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది అమెరికా సుప్రీంకోర్టు. దీనిపై 5-4 మెజార్టీతో కీలక తీర్పు ఇచ్చింది. ఫెడరల్‌ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వు ఉందని అందులో ప్రధానంగా ప్రస్తావించింది.

ట్రంప్ సర్కార్‌కు న్యాయస్థానంలో గట్టి ఝలక్

Advertisement

అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు కొరడా ఝలిపిస్తోంది. ట్రంప్ తీసుకొచ్చిన ప్రతీకార సుంకాలను కొన్ని నెలల కిందట రద్దు చేసింది న్యాయస్థానం. ఇప్పుడు జన్మహక్కు పౌరసత్వం వంతైంది.

జన్మతః పౌరసత్వ హక్కు రద్దు విషయంలో డొనాల్డ్ ట్రంప్‌ తీసుకొచ్చిన ఉత్తర్వులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌ షిప్‌ను రద్దు తీవ్రంగా వ్యతిరేకించింది. జన్మతః పౌరసత్వ హక్కు ఉండాల్సిందేనని తేల్చేయడంతో ట్రంప్ చేసిన ప్రయత్నాలకు గండి పడింది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును కలం పోటుతో రద్దు చేయలేరని పేర్కొంది.

Advertisement

జన్మహక్కు పౌరసత్వం వ్యవహారం, సుప్రీంకోర్టు కీలక తీర్పు

చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉండే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలకు పౌరసత్వం లభిస్తుందని క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగంలోని 14వ సవరణ, ఫెడరల్‌ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వులు ఉందని తెలిపింది. ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్‌ పదే పదే చెబుతూ వస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అధ్యక్షుడు ట్రంప్. జన్మతః పౌరసత్వం లభించే హక్కును అందరికీ కొనసాగించడం చాలా చేటని, దానిపై పరిమితులు విధిస్తూ చట్టం చేసేందుకు సిద్ధమేనని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జన్మతః పౌరసత్వ హక్కుకు ముగింపు పలికేందుకు కాంగ్రెస్‌ వెంటనే పని ప్రారంభించాలని అందులో రాసుకొచ్చారు.

ALSO READ: నిప్పులు కాదండోయ్.. ఈ అగ్నిపర్వతం కురిపించేది అచ్చమైన బంగారం.. ఎక్కడుందో తెలుసా?

అమెరికాలో 1868లో ఆమోదం పొందిన 14వ రాజ్యాంగ సవరణను ఒక్కసారి పరిశీలిద్దాం. అమెరికాలో పుట్టేవారు ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ అక్రమంగా లేదా తాత్కాలికంగా ఉన్నాఅమెరికా దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు పుట్టే పిల్లలకు మినహాయింపు ఉంటుంది.

జన్మతః పౌరసత్వానికి సంబంధించి ట్రంప్‌ సర్కార్ అపీలుపై ఏప్రిల్‌ ఒకటిన అక్కడి న్యాయస్థానం విచారణ చేపట్టింది. ట్రంప్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. దీని విషయంలో ట్రంప్‌ సర్కార్ తీసుకొచ్చిన ఉత్తర్వులు అమల్లోకి వచ్చి ఉంటే ఏటా అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై ప్రభావం చూపేది.

Related News

ఆగస్టు 15న భారత్‌కే కాకుండా.. ప్రపంచంలో ఇంకా ఏయే దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది?

ట్రంప్ సంచలన ప్రకటన.. హోర్మూజ్‌పై అమెరికా జెండా ఎగురేస్తాం

తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 గా నమోదు, సునామీ హెచ్చరిక జారీ

స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!

ఇరాన్‌ను బుజ్జగిస్తున్న యూఏఈ.. 3 బిలియన్ డాలర్ల నగదు, 2 టన్నుల బంగారం, 15 విమానాలు బదిలీ?

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్ట్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ!

ఫ్యామిలీని చంపడం ఎలా? చాట్‌జీపీటీ సమాధానాలు, తల్లి-తమ్ముడ్ని చంపిన భారత సంతతి టీనేజర్

సూర్యగ్రహణానికి, ఆ గ్రామానికి సంబంధం ఏమిటి? అక్కడ ఉండేది 10 మంది మాత్రమే!

Big Stories

Advertisement
×