BigTV English

Cancer Cells : క్యాన్సర్ సెల్స్ వ్యాప్తిని తగ్గించే ప్రొటీన్..

Cancer Cells : క్యాన్సర్ సెల్స్ వ్యాప్తిని తగ్గించే ప్రొటీన్..


Cancer Cells : ఈరోజుల్లో మనషుల మరణాలకు కారణమవుతున్న ఎన్నో ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్‌ను ముందే గుర్తించకపోవడమే ఎక్కువశాతం మరణాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. ముందే కనిపెట్టడం ద్వారా క్యాన్సర్‌ వేగంగా వ్యాప్తి చెందడాన్ని కూడా అదుపు చేయవచ్చని శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా మెదడులో క్యాన్సర్‌ వ్యాప్తి వేగాన్ని అదుపు చేయడం కోసం వారు ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టారు.

మెదడులో ఉన్న ఒక ప్రొటీన్.. క్యాన్సర్ వ్యాప్తిని తగ్గించగలవని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. మెదడులో యూబీఈ2సీ అనే ప్రొటీన్ శాతం బట్టి క్యాన్సర్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలుసుకునే ప్రయ్నతం చేశారు. ఎన్నో రకాల క్యాన్సర్లు ఈ ప్రొటీన్ పెరుగుదల వల్లే వేగంగా వ్యాపిస్తున్నాయని గుర్తించారు. ఈ పరిశోధనల కోసం వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న 30 మంది పేషెంట్లను శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. వారు చేసిన పరిశోధనల్లో కూడా ప్రొటీన్ ఆధిక్యత అనేది క్యాన్సర్ వ్యాప్తికి సాయం చేస్తుందని తెలిసింది.


ఎలుకలపై కూడా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలను చేసి చూశారు. యూబీఈ2సీ హై లెవెల్స్‌లో ఉండడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో ట్యూమార్ సెల్స్ వేగంగా వ్యాపిస్తున్నాయని తెలుసుకున్నారు. ఎలుకల్లో జరిగినట్టుగానే మనుషుల్లో కూడా క్యాన్సర్ ఇలాగే వ్యాపిస్తుందని తెలిపారు. క్యాన్సర్ సెల్స్ వేగంగా వ్యాపించడం వల్ల వైద్యులకు కూడా వారిని ట్రీట్ చేయడం కష్టంగా మారుతుంది. అయితే యూబీఈ2సీ శాతాన్ని తగ్గిస్తే క్యాన్సర్ వ్యాప్తి వేగం తగ్గుతుందని తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. ఆ కోణంలో పరిశోధనలు మొదలుపెట్టారు.

ఇప్పటికే పలు క్లీనికల్ ట్రయల్స్ చేసి యూబీఈ2సీని శాతాన్ని తగ్గించడం కోసం దాదాపు 650 శాంపుల్ డ్రగ్స్‌ను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇది యూబీఈ2సీని తగ్గించడంతో పాటు సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో క్యాన్సర్ సెల్స్‌ను వ్యాపించకుండా ఉండేలా ఈ డ్రగ్స్ సహాయపడతాయి. క్యాన్సర్ బయటపడిన తర్వాత అది మొదటి స్టేజ్‌లో ఉన్నప్పుడే ఈ డ్రగ్స్‌ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా పేషెంట్ ప్రాణాలను బతికిస్తాయి. ఇది క్యాన్సర్ పేషెంట్లను బతికించే ఎన్నో టెక్నాలజీలలో ఒకటిగా మారుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×