Big Stories

Ginger Tea Benefits: అల్లం చాయ్‌తో ఆస్తమా దూరం

Ginger Tea Benefits: సాధారణంగా అల్లాన్ని మనం కూరల్లో వాడుతుంటాం. టేస్ట్‌ కోసం టీలో కూడా వేసుకుంటాం. అయితే ఈ అల్లం టీ వల్ల ఆస్తమా కూడా నయం అవుతుందంటున్నారు నిపుణులు. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ సంవృద్ధిగా ఉన్నాయి. ప్రతిరోజు కప్పు అల్లం టీని తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆస్తమా, దగ్గుకు చెక్‌ పెట్టాలంటే మాత్రం రోజూ అల్లం టీని తేనెతో కలిపి తాగాలి. అల్లం టీతో రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఇందులోని ఖనిజ లవణాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. గుండెలోని కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండేందుకు ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాకుండా హృద్రోగాలు కూడా దరిచేరవు. ఈ అల్లం టీ వల్ల నెలసరి సమస్యలు తగ్గుతాయి. మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువశాతం అందుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉండే అరోమాలాంటి గుణాలు మన మెదడును ఉత్తేజ పరుస్తాయి. ఉదయాన్నే ఈ టీ తాగడం వల్ల రోజంతా చురుగ్గా ఉంచుతుంది. అంతేకాకుండా గర్భిణీలకు కూడా ఈ అల్లం టీ తాగడం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. వేవిళ్లు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మామూలు టీలో అల్లంరప్ప కలిపి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతిలో మంట, అజీర్ణంలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అల్లం టీ తాగడం వల్ల మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు రావు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి ఉన్నవారు అల్లం టీ తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News