Big Stories

Micro Plastics:- మైక్రోప్లాస్టిక్స్ వల్ల మెదడు వ్యాధుల హెచ్చరిక..

Micro Plastics:- ఈరోజుల్లో మానవాళికి ఇబ్బంది పెడుతున్న సమస్యలు, వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్స్ వినియోగాన్ని ఎంత నివారించాలని చూసినా.. దీనికి ప్రత్యామ్నాయంగా ఎన్ని ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చినా.. మానవాళి జీవితం నుండి ప్లాస్టిక్స్ దూరం అవ్వలేకపోతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్స్ వల్ల మనుషులకు ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలిసినా.. తాజాగా మరో పెద్ద సమస్య గురించి శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

- Advertisement -

ప్లాస్టిక్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. అందులో మనుషులకు ఎక్కువ హాని కలిగించేవి మైక్రో అండ్ నానోప్లాస్టిక్స్ (ఎమ్మెన్పీ). ఇవి ఎంత కాదనుకున్నా ఏదో ఒక విధంగా మనుషుల శరీరంలో వెళ్తూనే ఉన్నాయి. ఆఖరికి మనుషులు తినే ఆహారంలో కూడా ఏదో ఒక విధంగా ఎమ్మెన్పీ కలిసిపోతోంది. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధలనల్లో ఈ ఎమ్మెన్పీ గురించి షాకింగ్ విషయం బయటపడింది. ఇది మెదడులోని రక్తస్రావంపై తీవ్ర ప్రభావం చూపించి మెదడు పనితనాన్ని తగ్గిస్తుందని వారు కనుగొన్నారు.

- Advertisement -

ఇప్పటివరకు మనిషిపై ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎన్ని రకాలుగా ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. కానీ మనిషి మెదడుపై కూడా ఇవి తీవ్ర ప్రభావం చూపిస్తాయని మొదటిసారి తెలుసుకున్నారు. అందుకే మైక్రోప్లాస్టిక్స్ నుండి పర్యావరణాన్ని, మనుషులను కాపాడడానికి వెంటనే ఏదో ఒక ప్రయత్నం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఇటీవల పలు జంతువుల మెదడుపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది.

ఫుడ్ ప్యాకేజింగ్ దగ్గర నుండి మనం రోజూవారీ ఉపయోగించే ఎన్నో వస్తువుల్లో కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందుకే శాస్త్రవేత్తలు మైక్రోప్లాస్టిక్స్ తిన్న జంతువుల మెదడును పరిశోధించి చూశారు. అలాంటి ఆహార పదార్థాలు తిన్న రెండు గంటల్లోనే వారి మెదడుపై ప్రభావం చూపించడం మొదలయ్యిందని వారు కనుగొన్నారు. అయితే ఇప్పటివరకు మెడికల్ సైన్స్‌లో కూడా ఎప్పుడూ ఈ విషయం ఎలా బయటపడకుండా ఉంది అని వారు ఆశ్చర్యపోయారు.

కంప్యూటర్ మోడల్స్ ద్వారా మైక్రోప్లాస్టిక్స్ వల్ల మెదడుకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మైక్రోప్లాస్టిక్స్ వల్ల మెదడులో వాపు వంటి సమస్యలు మాత్రమే కాకుండా పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి హానికరమైన వ్యాధులు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉందని తేల్చారు. వీటన్నింటికి కచ్చితమైన పరిష్కారం మైక్రోప్లాస్టిక్స్‌కు దూరంగా ఉండడమే అని శాస్త్రవేత్తలు సలహా ఇచ్చినా.. ఇవి మనిషి కంటికి కనిపించనంత చిన్నగా ఉండి తెలియకుండానే వారి శరీరంలోకి వెళ్లిపోతాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News