BigTV English

RazorPay Credit Card Transactions in UPI : యూపీఐలో రేజర్‌ పే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు

RazorPay Credit Card Transactions in UPI : యూపీఐలో రేజర్‌ పే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు

RazorPay Credit Card Transactions in UPI : యూపీఐ చెల్లింపుల విషయంలో క్రెడిట్ కార్డ్‌ యూజర్లకు రేజర్ పే తీపి కబురు అందించింది. బుధవారం నుంచి యూపీఐలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలు సాధ్యమయ్యాయని రేజర్‌పే ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌ల కస్టమర్లు ఈ ప్రయోజనాలను ముందుగా పొందుతారని చెప్పింది. వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐతో లింక్ చేయడానికి అనుమతించే ఎన్‌సీపీఐ ఫీచర్‌ను స్వీకరించిన తొలి చెల్లింపు గేట్‌వే కూడా తామేనని రేజర్‌ పే తెలిపింది. అయితే, తమ చెల్లింపుల గేట్‌ వేని ఉపయోగించే వ్యాపారులకు మాత్రమే ఇది పరిమితమని వెల్లడించింది.


యూపీఐ క్రెడిట్ కార్డ్‌ లింకింగ్‌ ద్వారా కస్టమర్‌లు ఇకపై చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌లను పర్సులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది కార్డుల చోరీ లేదా క్రెడిట్ కార్డ్ పోగొట్టుకోవడం లాంటి కష్టాలకు తావు లేకుండా భద్రతను పెంచుతుంది. అలాగే స్వైపింగ్ మెషీన్ల దగ్గర కస్టమర్ సమాచారాన్ని స్కిమ్మింగ్ చేసే లేదా కాపీ చేసే ముప్పు నుంచి తప్పిస్తుంది. ప్రస్తుతం దేశంలో 25 కోట్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగిస్తున్నారు. దాదాపు 5 కోట్ల మంది వినియోగదారుల దగ్గర ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ పరిశ్రమ గత మూడు సంవత్సరాల్లో 30 శాతం పెరిగింది.

దేశంలో డిజిటల్‌ లావాదేవీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు త్వరలో వస్తువులు, సేవల కోసం యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆపరేటెడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో, ప్రస్తుతం వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే పరిమితమైన యూపీఐ చెల్లింపులు ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా అందుబాటులో రాబోతున్నాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×