Banana Flower: అరటి పువ్వులో అనేక పోషకాలు ఉంటాయి. అరటి పువ్వులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరం. అంతే కాదు డయాబెటిక్ పేషెంట్లు కూడా పచ్చి అరటిపండు తింటే వారికి ఎంతో మేలు జరుగుతుంది.
ఈ పువ్వు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే సహజమైన , ప్రభావవంతమైన నివారణ. ఈ పువ్వు మధుమేహానికి ఔషధంగా పనిచేస్తుంది. దీనిని తరుచుగా తినడం వల్ల బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మీరు మీ ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని ఈజీగా తగ్గించుకోవచ్చు. మీరు టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయితే, మీరు ప్రతిరోజు అరటి పువ్వులను తినాలి. అరటి పువ్వు డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా నియంత్రిస్తుంది.
అరటి పువ్వులు యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ప్రోటీన్లతో సహా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. 100 గ్రాముల అరటి పువ్వులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో దాదాపు 23 కేలరీలు, 4 గ్రాముల పిండి పదార్థాలు, 1.5 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ , కాపర్ కూడా పుష్కలంగా ఉంటాయి.
వీటిలో క్యాలరీలు తక్కువ. కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కరిగే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కరగని ఫైబర్ మలబద్ధకం , ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
అరటి పువ్వులు అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉంటాయి. ఇది తక్కువ సహజ చక్కెరను కలిగి ఉంటుంది. దీని కారణంగానే డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఎంపిక. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అరటిపువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అరటి పువ్వులు అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించే అనేక సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అరటి పువ్వులలో ఉండే ‘క్వెర్సెటిన్’, ‘కాటెచిన్’ వంటి యాంటీఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. అలాగే, తిన్న వస్తువులు వెంటనే చక్కెరగా మారడానికి అనుమతించవు. ఈ యాంటీఆక్సిడెంట్లు పిండి పదార్థాలను గ్రహించే ఎంజైమ్‌లను నిరోధించడం ద్వారా పని చేయవచ్చు.
ప్రేగులను ఆరోగ్యంగా, బలంగా చేస్తుంది:
కరిగే , కరగని ఫైబర్ సమృద్ధిగా ఉండే అరటి పువ్వు జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగల గట్ మైక్రోబయోమ్‌ను ఫైబర్ తీసుకోవడం మెరుగుపరుస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. గట్‌లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడంలో సహాయపడటానికి ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.
అరటి పువ్వు మధుమేహానికి ఎలా ఉపయోగపడుతుంది ?
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:
అరటి పువ్వు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
అరటి పువ్వులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది కార్బోహైడ్రేట్ల నెమ్మదిగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి వేగంగా పెరగదు.
Also Read: ఈ డ్రింక్ త్రాగితే .. బండ లాంటి కొవ్వు కూడా కరగాల్సిందే !
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:
డయాబెటిక్ రోగులు తమ బరువును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అరటి పువ్వులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అతిగా తినడం కూడా అంత మంచిది కాదు.