Big Stories

Storing Food On Fridge: ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తింటున్నారా.. ఇలా ఎన్ని గంటల తర్వాత తినకూడదో తెలుసా?

- Advertisement -

Storing Food On Fridge: ప్రస్తుతం ఎవరిని చూసినా బిజీ లైఫ్ లీడ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితాన్ని సాగిస్తూ తినడానికి కూడా సమయం లేకుండా తమ లైఫ్ స్టైల్‌ను మార్చుకుంటున్నారు. ఈ తరుణంలో సమయానికి వండుకుని తినే తీరిక లేక ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటున్నారు. వారానికి సరిపడా సరుకులు, కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి స్టోర్ చేసుకుంటున్నారు. అయితే వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని భావించినా కూడా అది అనారోగ్యానికే దారి తీస్తుందని ఆలోచించడం లేదు. వారాల పాటు కూరలు, కూరగాయలను ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

వండుకునే ఆహారం పాడవకుండా రెండు రోజులపాటు ఉండాలని భావించి ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆహారం పాడవకుండా ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి ఆహారాన్ని బయట పెట్టడం వల్ల త్వరగా పాడవుతాయి. అందువల్ల ఆహారం పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే ఇలా రిఫ్రిజిరేటర్‌లో ఆహారాన్ని ఎక్కువ సేపు స్టోర్ చేయకూడదట. కేవలం కొంత సమయం వరకు మాత్రమే స్టోర్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషక విలువలు కోల్పోతాయి..

ఆహారాన్ని ఎక్కువ సమయం పాటు ఫ్రిజ్‌‌‌లో ఉంచడం వల్ల దానిలోని పోషక విలువలు కోల్పోతుంది. ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని కేవలం 6 గంటల పాటు పోషకాలు ఉంటాయట. 6 గంటల సమయం కంటే ఎక్కువ సమయం పాటు ఉంటే అందులోని పోషకాలు కోల్పోతాయట. ముఖ్యంగా వండిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే 1 రోజులోపే తినాలి. ఒకవేళ ఈ ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచినా అతి తొందరగా అందులోని పోషక విలువలను కోల్పోతుంది. ఉదాహరణకు రొట్టెలను ఫ్రిజ్ లో ఉంచితే అది 12 నుండి 14 గంటలలోపు తినేయాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ఎక్కువ సమయం పాటు ఉంచడం వల్ల అందులోని పోషకాలు కోల్పోతుంది.

Also Read: ఉదయాన్నే ఈ డ్రైఫ్రూట్స్ అస్సలు తినొద్దు..

గ్యాస్ ఉత్పత్తి..

భోజనంలో భాగంగా వండిన పప్పును దాదాపు 2 రోజుల పాటు ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న పప్పును 2 రోజుల తర్వాత తింటే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుందని, దీని వల్ల ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలను వారం పాటు నిల్వ చేస్తాం. ఇలా ఎక్కువ రోజుల పాటు నిల్వ చేయడం వల్ల వాటి పోషక విలువలను కోల్పోయి.. హాని కలిగిస్తాయట. అయితే ఒకవేళ కూరగాయలు, పండ్లు కట్ చేయకుండా ఫ్రిజ్ లో ఉంచితే మాత్రం 3 నుండి 4 రోజుల పాటు ఉంచవచ్చు. అంతకు మించి ఎక్కువ రోజులు పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తరిగిన పండ్లు, కూరగాయలను ఫ్రిజ్ లో పెట్టాలని అనుకుంటే మాత్రం వాటిని 6 గంటలలోపే తినేయాలని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News