Rose Tea: గులాబీలను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. కానీ గులాబీలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. గులాబీలతో తయారు చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. రోజ్ టీలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్ తో పాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న రోజ్ టీ కి సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
రోజ్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఇవి జీవక్రియను పెంచుతాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజ్ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని అనుకుంటున్న వారు రోజ్ టీ తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
చర్మ కాంతిని పెంచుతుంది:
గులాబీలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కొల్లాజెన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా , యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అంతే కాకుండా చర్మ నష్టాన్ని నివారిస్తుందిజ. మచ్చలను కూడా తగ్గిస్తుంది. రోజ్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా సహజమైన మెరుపును కూడా పొండవచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
గులాబీ రేకులతో తయారుచేసిన టీ ఒక అద్భుతమైన హెర్బల్ టీ. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. రోజ్ టీని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల మీ జీర్ణశక్తి బలపడుతుంది. అంతే కాకుండా ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది.
వాపు సమస్యను తొలగించండి:
గులాబీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం.. ఈ డ్రింక్ తాగండి
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీరు రోజ్ టీని కూడా తాగవచ్చు. ఎందుకంటే రోజ్ టీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రోజ్ టీ తాగడం వల్ల తరచూ ఆరోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు. జలుబు, దగ్గు వంటివి కూడా రాకుండా ఉంటాయి.
ఒత్తిడి తక్కువగా ఉంటుంది:
నేటి బిజీ జీవితం, చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఒత్తిడి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. గులాబీ రేకులలో ఉండే లక్షణాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రోజ్ టీ తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అంతే కాకుండా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.