Mint leaves uses: పుదీనా ఆకులు ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తాయి. పుదీనా ఆకుల వాసన చూస్తేనే మైండ్ అంతా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. వంటలకు మంచి రుచి, వాసన అందించడానికి పుదీనాను వాడుతుంటారు. పుదీనా వంటలకు మంచి వాసనను, రుచిని పెంచడానికే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ పుదానా ఆకులు మన ఆహారంలో, టీ రూపంలో తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
జలుబు, దగ్గు మాటాష్..
పుదీనా ఆకును నీళ్లలో వేసి మరిగించి తాగితే జలుబు, దగ్గు సమస్య నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పుదీనా శోథ నిరోధక లక్షణాలతో శ్వాసనాళాల రద్దీని తగ్గిస్తుంది మరియు జలుబు మరియు ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పోషకాలు అనేకం..
పుదీనాల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు ప్యాక్ చేసి ఉన్నాయి. పుదీనాలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకుల్లోని విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. పుదీనాలో ఐరన్, మాంగనీస్, ఫోలేట్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియ విధులు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి
జీర్ణక్రియ సమస్యలు మాయం..
పుదీనాలోని ఔషధ గుణాలు.. జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం చేయడానికి సహాయపడతాయి. ఐబీఎస్ ఉన్న వ్యక్తులు వారి డైట్‌లో పుదీనా చేర్చుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం సమస్యలు దూరం అవుతాయి. పుదీనా జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది.
నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది..
పుదీనా… శ్వాసను తాజా పెంచుతుంది. పుదీనా ఆకులు నమిలితే.. నోరు రిఫ్రెష్‌గా ఉండటమే కాదు.. చిగుళ్లు. దంతాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పుదీనాలో హానికరమైన బ్యాక్టీరియాతో పోరడటానికి తోడ్పడుతుంది. మీరు నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. రోజూ పుదీనా ఆకులు నమలండి. దీనిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
Also Read: ఇదేందిరా మామ.. దానిమ్మ తొక్కలతో తెల్లజుట్టు నల్లగా మార్చుకోవచ్చా..?
అలెర్జీల నుంచి ఉపశమనం..
పుదీనాలో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పుదీనా అలెర్జీలు, ఆస్తామా వంటి.. శ్వాసకోస పరిస్థితులకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది. పుదీనా తీసుకోవడం వల్ల చర్మానికి తాజాదనం ఇస్తుంది, చర్మ కణాలను ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది మరియు చర్మం చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పుదీనా నూనెను తలనొప్పి, వికారం మరియు స్పాస్మోడిక్ నొప్పులకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు.
వికారాన్ని తగ్గిస్తుంది..
పుదీనా ప్రయాణాల సమయంలో వచ్చే వికారం లేదా ఉదయాన్నే వచ్చే వికారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆకును సలాడ్లు, పానీయాలు మరియు ఇతర వంటకాలలో రుచిని పెంచడానికి ఉపయోగించవచ్చు. పుదీనాను ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.