E-Paper
Advertisement

ఎలాంటి డ్రెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు? మీ బాడీషేప్‌కు తగిన బట్టలు ఇలా ఎంచుకోండి

ఎలాంటి డ్రెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు? మీ బాడీషేప్‌కు తగిన బట్టలు ఇలా ఎంచుకోండి
Advertisement

అందంగా కనిపించేందుకు సరైన దుస్తులు ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. స్టైలిష్‌గా కనిపించడానికి ఖరీదైన దుస్తులు అవసరం లేదు. సరైన దుస్తులు మీ రూపాన్ని పూర్తిగా మార్చగలవు. చాలామంది సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను చూసి దుస్తులు కొనుగోలు చేస్తారు. అయితే ఒకే డ్రెస్ అందరికీ ఒకేలా కనిపించదు.

ప్రతి మహిళ శరీరాకృతి ప్రత్యేకంగా, వేరుగా ఉంటుంది. మీ బాడీ షేప్‌ను తెలుసుకుంటే సరైన దుస్తులను సులభంగా ఎంచుకోవచ్చు. సరైన ఫ్యాషన్ సెన్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అలాగే శరీరాకృతికి సమతుల్యతను తీసుకువస్తాయి.

ముందుగా మీ బాడీ షేప్‌ తెలుసుకోవాలి

Advertisement

శరీరాకృతి ఫ్యాషన్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన దుస్తులు మీ అందాన్ని మరింత హైలైట్ చేస్తాయి. మీరు కుర్తీలు, చీరలు, జీన్స్ లేదా గౌన్లు ధరించినా సరైన ఫిట్టింగ్ చాలా ముఖ్యం. చిన్న చిన్న స్టైలింగ్ మార్పులు కూడా మీ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

పియర్ బాడీ షేప్ ఉన్నవారికి సూచనలు

పియర్ బాడీ షేప్ ఉన్నవారిలో భుజాల కంటే నడుము దిగువ భాగం వెడల్పుగా ఉంటుంది. ఈ శరీరాకృతిలో పై భాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. బోట్ నెక్, స్క్వేర్ నెక్ లేదా ఆఫ్ షోల్డర్ టాప్స్ మంచి ఆప్షన్స్. ఎంబ్రాయిడరీ లేదా డిజైన్ ఉన్న టాప్స్ కూడా అందంగా కనిపిస్తాయి. ఏ-లైన్ డ్రెస్సులు, అనార్కలి కుర్తీలు ఈ బాడీ షేప్‌కు బాగా సరిపోతాయి. డార్క్ కలర్ బాటమ్స్‌తో పాటు లైట్ లేదా బ్రైట్ టాప్స్ ధరించడం మంచిది.

అవర్‌గ్లాస్ బాడీ షేప్

Advertisement

ఈ శరీరాకృతిలో భుజాలు, నడుము దిగువ భాగం సమతుల్యంగా ఉంటాయి. నడుము భాగాన్ని హైలైట్ చేసే దుస్తులు అందాన్ని పెంచుతాయి. బాడీకాన్ డ్రెస్సులు, ర్యాప్ టాప్స్ వేసుకోవడం మంచిది.
పెప్లమ్ టాప్స్ సహజమైన వంపులను మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి. ఓవర్‌సైజ్ దుస్తుల కంటే సరైన ఫిట్టింగ్ ఉన్న దుస్తులు ధరిస్తే వీరు మరింత అందంగా కనిపిస్తారు.

యాపిల్ బాడీ షేప్

యాపిల్ బాడీ షేప్ ఉన్నవారిలో పొట్ట భాగం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. వీ నెక్ టాప్స్ మెడను పొడవుగా చూపిస్తాయి. ఎంపైర్ వెయిస్ట్ డ్రెస్సులు సౌకర్యవంతంగా ఉంటాయి. సాఫ్ట్, ఫ్లోయింగ్ ఫ్యాబ్రిక్‌తో తయారైన దుస్తులు మంచి ఆప్షన్. అతి బిగుతైన దుస్తులు ధరించకుండా ఉండటం మంచిది.

Also Read: బ్రేకప్ తరువాత అందరూ చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?

రెక్టాంగిల్ బాడీ షేప్ 

ఈ బాడీ షేప్‌లో భుజాలు, నడుము, హిప్స్ దాదాపు ఒకే కొలతలో ఉంటాయి. వంపులు తక్కువగా కనిపిస్తాయి. క్రాప్ టాప్స్‌ను హై వెయిస్టెడ్ జీన్స్ లేదా స్కర్ట్స్‌తో జత చేయవచ్చు. రఫిల్స్, ప్లీట్స్ లేదా లేయర్ డిజైన్లు ఉన్న టాప్స్ మరింత అందంగా కనిపిస్తాయి. ఫ్లేర్డ్ డ్రెస్సులు శరీరానికి అందమైన ఆకృతినిస్తాయి.

ఆత్మవిశ్వాసమే అసలైన ఫ్యాషన్

ఫ్యాషన్ అంటే శరీరాకృతిని దాచడం కాదు. దాన్ని అందంగా చూపించడం. మీకు సౌకర్యంగా అనిపించే దుస్తులను ఎంచుకోవాలి.  చిన్న చిన్న స్టైలింగ్ మార్పులు కూడా పెద్ద తేడాను చూపించగలవు. మీకు అందంగా, ఆత్మవిశ్వాసంగా అనిపించే దుస్తులే బెస్ట్.

Related News

బంగారు మోదక్స్‌కు భారీ డిమాండ్.. కిలో రూ.27000.. మీకూ కావాలా?

పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్.. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసే 5 పాస్తా రెసిపీలు

మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీరసంగా అనిపిస్తోందా? రోజంతా ఫుల్ ఎనర్జీ కోసం సింపుల్ టిప్స్

అవసరం తీరిపోయాక పట్టించుకోరు.. ఈ రాశుల్లో పుట్టినవారు స్వార్థపరులు

ఉదయం లేచినప్పటి నుంచి సిగరెట్ తాగే వ్యసనం.. ఈ చిట్కాతో కొన్ని నిమిషాల్లోనే మానేశాడు

పవిత్రమైన తులసి.. గణపతికి మాత్రం పెట్టరు.. ఎందుకో తెలుసా?

పెళ్లి తర్వాత తొలి వినాయక చవితి.. నవదంపతులు తప్పక పాటించాల్సిన 7 అందమైన సంప్రదాయాలు

ఏనుగు తల నుంచి 21 పత్రుల వరకు.. గణపతి గురించి 5 ఆసక్తికర విషయాలు!

Big Stories

Advertisement
×