Summer Fruits: వేసవి కాలంలో వేడిగాలులు డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తాయి. ఇది అనేక రకాల వ్యాధులకు కూడా కారణం అవుతుంది. సమ్మర్‌లో శరీరంలో అధిక చెమట, ఎలక్ట్రోలైట్స్ లోపం వంటివి గుండె పనితీరును నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. హృదయాన్ని చల్లబరిచే.. పోషణను అందించే పండ్లను మన ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.
గుండె కండరాలను బలంగా ఉంచడంలో.. రక్తపోటును నియంత్రించడంలో , ధమనులను శుభ్రపరచడంలో సహాయపడే పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే కొన్ని సీజనల్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వేసవిలో గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే 5 పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ:
పుచ్చకాయలో 90% వరకు నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది . అంతే కాకుండా గుండెకు మేలు చేస్తుంది. ఇందులో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. రక్తపోటును నియంత్రించడంలో , సాధారణ హృదయ స్పందనను నిర్వహించడంలో కూడా ప్రభా వవంతంగా పనిచేస్తుంది.
జామ:
జామలో ఉండే అధిక ఫైబర్ , పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ సి కంటెంట్ గుండె కణజాలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా వాపును కూడా తగ్గిస్తుంది.
అరటిపండు:
ముఖ్యంగా వేసవిలో అరటిపండు గుండెకు సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హృదయ స్పందనను స్థిరీకరించడంలో, అంతే కాకుండా అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండు తినడం వల్ల గుండెపై అనవసరమైన ఒత్తిడి పడకుండా ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.
Also Read: కాఫీ తాగితే.. శరీరంలో జరిగేది ఇదే ?
ద్రాక్ష:
ద్రాక్షలో ఫ్లేవనాయిడ్లు, రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండె జబ్బు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ధమనుల లైనింగ్‌ను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ద్రాక్ష కూడా శరీరాన్ని చల్లబరుస్తుంది.
మామిడి పండ్లు:
మామిడి పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ.. పరిమిత పరిమాణంలో వీటిని తీసుకోవడం గుండెకు మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు ఎ మరియు సి ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో , ధమనులలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మామిడి గుండె కణాలను మరమ్మతు చేయడంలో కూడా సహాయపడుతుంది.