Black Coffe Vs Milk Coffee: కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ? చాలా మంది కాఫీ తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. ఇదిలా ఉంటే.. కొంతమంది బ్లాక్ కాఫీ తాగడం మంచిదని చెబుతుంటే.. మరికొందరు పాలతో తయారు చేసిన కాఫీ బెస్ట్ అని అంటుంటారు. నిజానికి.. ఈ రెండు కాఫీలను తయారు చేసే పద్ధతి మాత్రమే కాకుండా, వాటి ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
.బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ మధ్య అతిపెద్ద తేడా వాటి తయారీలో ఉంటుంది. బ్లాక్ కాఫీలో కాఫీ పౌడర్ ,నీరు మాత్రమే కలుపుతారు. కొంతమంది రుచి కోసం దీనికి కొద్దిగా చక్కెర లేదా తేనె కూడా కలుపుతారు. దాని రుచి చాలా బలంగా ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ కాఫీలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కొంతమంది మిల్క్ కాఫీకి కండెన్స్‌డ్ మిల్క్ లేదా క్రీమ్ కలుపుతారు. తర్వాత కాఫీ, చక్కెర రెండూ యాడ్ చేస్తారు. ఈ కాఫీలో చాలా కేలరీలు ఉంటాయి. కానీ దాని రుచి చాలా బాగుంటుంది.
మీరు నాడీ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం:
బ్లాక్ కాఫీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేలరీలు లేని కాఫీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే బ్లాక్ కాఫీ మీకు ఉత్తమమైనది. ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. పాలు లేకుండా తయారుచేసిన ఈ కాఫీలో ఎక్కువ కెఫిన్ ఉంటుంది. ఇది మీకు ఎక్కువ శక్తిని ఇస్తుంది. మీరు మీ పనిలో ఏకాగ్రతను పెంచుకోవాలనుకుంటే బ్లాక్ కాఫీ తాగాలి. కొన్ని పరిశోధనలు బ్లాక్ కాఫీ నాడీ సంబంధిత వ్యాధులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తున్నాయి. ఇది డోపమినెర్జిక్ సిగ్నలింగ్‌ను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మీరు గ్యాస్ లేదా అసిడిటీతో బాధపడుతుంటే ఖచ్చితంగా బ్లాక్ కాఫీ తాగండి.
మిల్క్ కాఫీ తాగితే మానసిక స్థితి మెరుగుపడుతుంది:
పాల కాఫీ చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా, చాలా మంది దానిని తాగడానికి ఇష్టపడతారు. పాలు లేదా క్రీమ్ తో తయారుచేసిన ఈ కాఫీలో ప్రోటీన్, కాల్షియం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధిక కేలరీలు ఉన్నప్పటికీ. దాని గొప్ప రుచి మీకు శక్తిని ఇస్తుంది . మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాఫీ పాలీఫెనాల్స్ , మిల్క్ అమైనో ఆమ్లాల కలయిక అద్భుతమైన కలయికను సృష్టిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కణాల వాపును తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ కణాలను బలపరుస్తుంది. మంచి నిద్రకు కాఫీ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: లిప్‌స్టిక్ తెగ వాడేస్తున్నారా ? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు !
మీకు ఏది ఉత్తమం:
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఏ కాఫీ మంచిది అని ? బ్లాక్ కాఫీ లేదా మిల్క్ కాఫీ. నిజానికి, ఇది పూర్తిగా మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. మీరు ఆరోగ్యం కోసం కాఫీ తీసుకుంటుంటే బ్లాక్ కాఫీ మీకు మంచిది. ఏదైనా వ్యాయామం లేదా కార్యకలాపానికి ముందు బ్లాక్ కాఫీ తాగడం మంచిది ఎందుకంటే ఇందులో పిండి పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో తక్కువ కేలరీలు ఎక్కువ కెఫిన్ ఉంటాయి. రాత్రిపూట దీని తీసుకోకుండా నివారించాలి. పాలతో తయారు చేసిన కాఫీని ఉదయం ఖాళీ కడుపుతో తాగకూడదు. దీనివల్ల మీకు గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.