E-Paper
Advertisement

రాగి బాటిల్‌లో నీరు తాగుతున్నారా? మీరు చేసే ఈ 3 తప్పులు ఆరోగ్యానికి హానికరం

రాగి బాటిల్‌లో నీరు తాగుతున్నారా? మీరు చేసే ఈ 3 తప్పులు ఆరోగ్యానికి హానికరం
Advertisement

ఇటీవలి కాలంలో చాలా మంది ఆఫీస్, లేదా ఎక్కడైనా బయటికి వెళ్లినప్పుడు లేదా ప్రయాణాలు చేసే సయమంలో తమతో వాటర్ బాటిల్స్ తీసుకెళుతున్నారు. అయితే ఆరోగ్యానికి ప్రాధాన్య మిచ్చే వారు రాగి వాటర్ బాటిల్స్‌ ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం రాగి నీరు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చాలా ఆధునిక పరిశోధనల్లో కూడా రాగికి బ్యాక్టీరియాలను తగ్గించే లక్షణాలు ఉన్నాయని తేలింది. అయితే రాగి బాటిల్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం.

రాగి నీరు వల్ల కలిగే ప్రయోజనాలు

Advertisement

రాగి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రాగిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడతాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా రాగి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే రాగి బాటిల్ ఉపయోగించే సమయంలో చాలా మంది ఈ తప్పులు చేస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది.

మూడు తప్పులు

వేడి నీటిని రాగి బాటిల్‌లో పోయడం

చాలా మంది వేడి లేదా మరిగించిన నీటిని నేరుగా రాగి బాటిల్‌లో పోస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. వేడి నీళ్ల కారణంగా నీటిలో రాగి పరిమాణం ఎక్కువగా కలిసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో అధిక రాగి శరీరానికి మంచిది కాదు. అందువల్ల నీరు చల్లబడిన తర్వాత మాత్రమే రాగి బాటిల్‌లో నిల్వ చేయాలి.

ఆరోగ్య సమస్యలను పట్టించుకోకపోవడం

Advertisement

రాగి నీరు ప్రతి ఒక్కరికీ సరిపోదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లివర్ సంబంధిత వ్యాధులు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు రాగి నీటిని తరచుగా తాగే ముందు వైద్యులను సంప్రదించాలి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.

ఖాళీ కడుపుతో రాగి నీరు తాగడం

చాలా మంది రాత్రి బాటిల్‌లో నీరు నింపి ఉదయం ఖాళీ కడుపుతో తాగుతారు. అయితే ఈ అలవాటు అందరికీ ఆరోగ్యకరం కాకపోవచ్చు. కొందరికి కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు రావచ్చు.
అలాంటి ఇబ్బందులు కనిపిస్తే వెంటనే ఆ అలవాటును మార్చుకోవాలి.

Also Read: భర్త చేసే ఈ ఒక్క తప్పు వల్లే భార్యకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. ఎలాగంటే

రాగి నీరు అద్భుత ఔషధం కాదు

రాగి నీరు ఆరోగ్యానికి ఉపయోగపడినా, అది అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మరింత ముఖ్యమైనవి. ఏ విషయమైనా మితంగా పాటించడం మంచిది.

Also Read: గర్భంలో బిడ్డ 24 గంటలు ఏం చేస్తుంటాడు.. ఎంతసేపు నిద్రపోతాడు, ఎప్పుడు మెళుకువగా ఉంటాడు?

రాగి బాటిల్స్‌తో సరైన విధంగా ఉపయోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే కొన్ని సాధారణ తప్పులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు.

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×