BigTV English

Hyderabadi Kebab: హైదరాబాదీ కబాబ్స్ ఇంట్లో ఇలా సులువుగా చేసేయండి, ఈ మటన్ రెసిపీ మీకు నచ్చడం ఖాయం

Hyderabadi Kebab: హైదరాబాదీ కబాబ్స్ ఇంట్లో ఇలా సులువుగా చేసేయండి, ఈ మటన్ రెసిపీ మీకు నచ్చడం ఖాయం

వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పండగే. అన్ని రకాల మాంసాహారాలు వండుకొని తినేందుకు ఇష్టపడతారు. ఇక్కడ మేము హైదరాబాద్ కబాబ్ రెసిపీ ఇచ్చాము. ఇంట్లో చిన్న పార్టీలు, వేడుకలు ఉంటే కచ్చితంగా ఈ కబాబ్స్ ఉండాల్సిందే. దీని వండడం కూడా చాలా సులువు. హైదరాబాదులోని రాయల్ కిచెన్లో ఒకప్పుడు కబాబ్స్ ను వండే వారని చెబుతారు. వాటిని తినేందుకు ఎంతో ఇష్టపడే వారని అంటారు. మటన్ తో చేసే ఈ కబాబులు ఎంతో టేస్టీగా ఉంటాయి.


హైదరాబాద్ కబాబ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
మటన్ కీమా – అరకిలో
శనగపప్పు – పావు కప్పు
నూనె – తగినంత
యాలకులు – ఆరు
లవంగాలు – నాలుగు
దాల్చిన చెక్క – రెండు ముక్కలు
షాజీరా – అర స్పూను
ఉల్లిపాయలు – ఐదు
వెల్లుల్లి రెబ్బలు – 20
కారం – ఒక స్పూను
పసుపు – అర స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – రెండు
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
మిరియాలు – అర స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
స్టోన్ ఫ్లవర్ – రెండు

హైదరాబాదీ కబాబ్ రెసిపీ
1. మటన్ కీమాను పరిశుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
2. ఆ నూనెలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవరు, షాజీరా వేసి వేయించాలి.
3. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసి వేయించుకోవాలి.
4. ఇవి బాగా వేగాక ఉల్లిపాయల తరుగు, వెల్లుల్లి తరుగు వేసి బాగా వేయించాలి.
5. శనగపప్పును ముందుగానే నానబెట్టుకోవడం మర్చిపోవద్దు.
6. ఇప్పుడు ఉల్లిపాయల మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
7. తర్వాత నానబెట్టిన శెనగపప్పును కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రెండు కప్పుల నీటిని వేసి బాగా కలుపుకోవాలి.
8. ఈ మొత్తం మిశ్రమాన్ని కుక్కర్లో వేసి ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ మీద ఉడికించాలి.
9. నీరంతా ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. నీరు ఇంకిపోయాక ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి.
10. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో దాన్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
11. ఇప్పుడు మటన్ మిశ్రమంలో కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు ఉండేలా చూసుకోవాలి.
12. ఇప్పుడు ఈ మిశ్రమం నుంచి కొంత తీసి కబాబులాగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
13. ఆ నూనెను లో కబాబులను వేయించుకోవాలి. రెండువైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
14. అంతే టేస్టీ హైదరాబాద్ కబాబ్ రెడీ అయినట్టే. దీన్ని ఒకసారి వండుకొని చూడండి చాలా సింపుల్ గా ఉంటాయి.


ఈ మటన్ కబాబ్ లో పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. రెండు మూడు కబాబులు తింటే చాలు.. పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. పిల్లలకు కూడా వీటిని తినిపించవచ్చు. ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Related News

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×