BigTV English

Don’t Eat this food @Night: రాత్రి వేళ ఇవి అస్సలు తినకూడదు.. తింటే ఇక మీ పని అంతే..!

Don’t Eat this food @Night: రాత్రి వేళ ఇవి అస్సలు తినకూడదు.. తింటే ఇక మీ పని అంతే..!

Avoid these Foods @Night: రాత్రి వేళ కొన్ని ఆహారాలు అస్సలు తినకూడదు. ముఖ్యంగా రాత్రి 8 గంటలు దాటితే భోజనం కూడా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట. నిద్రపోయే సమయానికి ఒక అరగంట ముందే భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అది కూడా రాత్రి వేళ తేలిక పాటి భోజనం చేయాలని సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయాలట. అయితే రాత్రి సమయంలో కొన్ని ఆహార పదార్థాలను మాత్రం అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. తేలిక పాటి ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఎలాంటి ఫుడ్ తినాలి, తినకూడదో తెలుసుకుందాం.


రాత్రి వేళ అధిక కేలరీలు ఉన్న ఫుడ్ తీసుకోకూడదట. కేలరీలు తక్కువగా ఉన్న ఫుడ్ ను మాత్రమే రాత్రి భోజనంగా ఎంచుకోవాలట. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి భోజనంలో అస్సలు తీసుకోకూడదు. అయితే రాత్రి వేళ మాత్రమే కాకుండా భోజనం చేసిన అనంతరం వాకింగ్ చేయాలట. ముఖ్యంగా రాత్రి వేళ తీపి వస్తువులను అస్సలు తీసుకోకూడదు. చాక్లెట్లు వంటి వాటిని తీసుకోవడం అస్సలు మంచిది కాదు.

Also Read: Right Time to Eat: సమయానికి తినకపోతే ఎన్ని వ్యాధుల బారినపడతారో తెలుసా..?


ఇక చిప్స్ వంటి ఫ్రై చేసిన వస్తువులను కూడా రాత్రి ఆహారంలో తీసుకోకూడదు. ఫ్రై చిప్స్ ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అధిక కేలరీలు ఉండే వీటిని మాత్రం రాత్రి సమయంలో తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఆల్మహాల్ వంటి మత్తు పానీయాలను కూడా తీసుకోకూడదట. రాత్రి మద్యం తీసుకోవడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం ముప్పనే చెప్పాలి. ఇక కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే లేట్ నైట్ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర, కేలరీలు అధికంగా ఉండడం వల్ల కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×