E-Paper
Advertisement

Ayurvedam: అర్జున బెరడు ఇంట్లో ఉంటే చాలు ఈ రోగాలేవీ రావు

Ayurvedam: అర్జున బెరడు ఇంట్లో ఉంటే చాలు ఈ రోగాలేవీ రావు
Advertisement

ఆయుర్వేదంలో అర్జున బెరడుఎంతో ప్రసిద్ధి చెందిన ఔషధ మొక్కగా చెప్పుకుంటారు. ముఖ్యంగా అర్జున బెరడు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాతకాలం నుంచే దీన్ని గుండె బలహీనత, ఛాతి నొప్పి వంటి సమస్యల్లో ఉపయోగిస్తున్నారు. అర్జున బెరడు పొడి గుండె కండరాలను బలపరచడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో గుండె టానిక్ గా కూడా చెప్పుకుంటారు.

నిపుణులు చెబుతున్న ప్రకారం అర్జున బెరడు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడవచ్చు. ఇది రక్తనాళాలను సడలించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అర్జున చాలు చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరగడానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో కూడా ఇది దోహదపడుతుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి.

Advertisement

Also read: Tomato pulao: టేస్టీగా వేడి వేడి టమోటా పులావ్ తింటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో

గుండెకు రక్షణ
ఇంకా అర్జున బెరడు పొడి శరీరానికి యాంటీఆక్సిడెంట్‌లను అందిస్తుంది. ఇవి కణాలను రక్షించి వాపు తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల గుండె మాత్రమే కాకుండా కాలేయం, రక్తనాళాలు వంటి ఇతర అవయవాల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనల్లో అర్జున చాలు గుండె వైఫల్యం, అంగైనా వంటి సమస్యలలో కూడా సహాయకంగా పనిచేసిందని నివేదికలు వెల్లడించాయి. అలాగే శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో కూడా దీని పాత్ర ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Also read: Weightloss Roti: బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని రోటీలు తినాలి? ఏ పిండితో చేసిన రోటీ తింటే మంచిది?

ఎక్కువ తింటే ప్రమాదమే
అర్జున బెరడు సహజ ఔషధం అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ దాన్ని స్వయంగా తీసుకోవడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు, బీపీ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కోసం మందులు తీసుకుంటున్నవారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే ఉపయోగించాలి. సరైన మోతాదు, సరైన విధానం పాటిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఆయుర్వేద మందులు సహాయకంగా ఉపయోగపడతాయి కానీ వైద్య చికిత్సకు పూర్తిగా ప్రత్యామ్నాయం కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వయంగా మందులు తీసుకోవడం కన్నా నిపుణుల సలహాతోనే అర్జున బెరడు ఉపయోగించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

Also read: CIBIL Score: నెల రోజుల్లో సిబిల్ స్కోర్ ఇలా సింపుల్ గా పెంచేయండి, లోన్ త్వరగా వచ్చేస్తుంది

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×