BigTV English

Brinjal: వంకాయ అంటే ఇష్టమా? ఈ సమస్యలు ఉన్నా తిన్నారంటే అంతే!

Brinjal: వంకాయ అంటే ఇష్టమా? ఈ సమస్యలు ఉన్నా తిన్నారంటే  అంతే!

Brinjal: వంకాయను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది ఎంతో రుచికరమైన ఈ కూరగాయ ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వంకాయలో ఉండే పోషకాలు, విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, కొంతమంది వంకాయను తినకుండా ఉండడం మంచిది. వంకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, దీనిని ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.


వంకాయలోని పోషక విలువలు
వంకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని డైట్‌లో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్-సి, విటమిన్-కె, విటమిన్-బి6, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా, వంకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అనేక వ్యాధులను నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వంకాయ వల్ల ప్రయోజనాలు
గుండె ఆరోగ్యానికి మేలు
వంకాయలోని ఫైబర్, పొటాషియం, విటమిన్-సి కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయట. వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయని డాక్టర్లు చెబుతున్నారు.


జీర్ణవ్యవస్థకు మంచిది
వంకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు దీన్ని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుందట. అలాగే గట్ బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తుందట.

బరువు తగ్గడానికి
వంకాయలో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు వంకాయను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

షుగర్ కంట్రోల్
డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తరచుగా తీసుకునే ఆహారంలో వంకాయను చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వంకాయలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందట. అంతేకాకుండా ప్రీ డయాబెటిక్ రిస్క్‌ని తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

క్యాన్సర్ నివారణ
వంకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా నాసునిన్ అనే సమ్మేళనం, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది శరీర కణాలను డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుతుందట.

మెదడు ఆరోగ్యానికి
వంకాయలోని ఫైటోన్యూట్రియెంట్స్ మెదడు కణాలను రక్షిస్తాయని న్యూరాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయట. అంతేకాకుండా వృద్ధాప్యంలో సంభవించే మెదడు సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వంకాయను ఎవరు తినకూడదు?
అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకుండా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొంతమందికి వంకాయ తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస సమస్యలు వస్తాయి. అలాంటి వారు వంకాయను పూర్తిగా తినకూడదని డాక్టర్లు చెబుతున్నారు.

ALSO READ: ఇది బయట ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి

ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండడమే మంచిది. వంకాయలో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కిడ్నీ స్టోన్స్ సమస్యను పెంచవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

వంకాయలో సోలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది కొందరిలో ఆర్థరైటిస్ లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు. ఆర్థరైటిస్ ఉన్నవారు వంకాయను తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×