Heart Attack Warnings: ఈ రోజుల్లో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు. గుండెపోటు రావడానికి చాలా ఏళ్ల ముందే గుండె హెచ్చరికలు పంపుతుందంటున్నారు. వాటిని జాగ్రత్తగా గమనిస్తే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉందంటున్నారు. చాలా ఏళ్లుగా కొనసాగించిన అధ్యయనాల ప్రకారం గుండెపోటు రావడానికి చాలా ఏళ్ల ముందే గుండె హెచ్చరికలను పంపుతుందంటున్నారు. ఇంకా చెప్పాలంటే 12 ఏళ్ల ముందే గుండెపోటు సూచనలు కనిపిస్తాయంటున్నారు.
శారీరక శ్రమ తగ్గితే గుండెపోటు ముప్పు
హృదయ సంబంధ పరిశోధన ప్రకారం శారీరక శ్రమ లేకపోవడం అనేది పలు జీవ సంబంధ మార్పులకు దారి తీస్తుంది. గుండె డీకండిషనింగ్ కు లోనవుతుంది. స్ట్రోక్ వాల్యూమ్, ఏరోబిక్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. గుండె సాధారణ పనితీరును కష్టతరం చేస్తుంది. కదలిక లేకపోవడం అనేది ఎండోథెలియల్ పని తీరును దెబ్బతీస్తుంది. రక్త నాళాలు కూడా బలహీనం అవుతాయి. శారీరక శ్రమ తగ్గడం అనేది జీవక్రియను మరింత దిగజార్చుతుంది. బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, లిపిడ్ ఆటంకాలకు దారితీస్తుంది. ఇవన్నీ కలిపి గుండె మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందన్నారు పరిశోధకులు.
ముందస్తు గుర్తింపు కోసం పరీక్షలు
చాలా మంది వైద్యులు గుండె సంబంధ సమస్య గురించి తెలుసుకునే సమయంలో ప్రస్తుత అలవాట్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. అలా కాకుండా కొన్ని సంవత్సరాలుగా స్టామినా మార్పుల గురించి అడగాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్, గ్లూకోజ్, బరువు, నడకకు సంబంధించిన ప్రశ్నలు అడగాలి.
వారానికి 150 నిమిషా శారీరకశ్రమ
మనిషి గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే WHO పారామీటర్స్ ప్రకారం ఒక మనిషి వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇతరత్రా పనులు చేయడం ఇంకా మంచిదంటున్నారు. శరీరానికి వ్యాయామంతో పాటు పోషకాహారం, మానసిక ప్రశాంతంత కూడా గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయంటున్నారు.
Read Also: డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్నారా ? కారణాలివేనట !
దీర్ఘకాలిక హార్ట్ ట్రాకింగ్ తప్పనిసరి
ఈ రోజుల్లో చాలా మంది అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్ లలో గంటల తరబడి వ్యాయామాలు చేసే వారు కూడా చనిపోతున్నారు. అయితే, గుండె సంబంధ సమస్యలను ట్రాక్ చేయడానికి స్మార్ట్ పరికరాలను ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు ముందుగానే వ్యాధి లక్షణాలను గుర్తించే అవకాశం ఉంటుంది. వీటి ఆధారంగా వైద్యుడిని సంప్రదించి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు కచ్చితంగా గుండె విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానం కలిగినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.