Liver Health: కడుపు, కాలేయం, జీర్ణవ్యవస్థ, గుండె, చర్మం, ఎముకలు.. ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు లేకుండా చురుగ్గా పనిచేయాలి. అప్పుడే మనం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతాం. శరీరం యాక్టివ్‌గా ఉంటే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే.. అస్తవ్యస్తమైన జీవనశైలి, చెడు అలవాట్లు, తినే తిండి సరిగ్గా లేకపోవడంతో… కాలేయ సంబంధిత సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు:
పసుపును మనం వంటల్లో ఎక్కువగా వాడతాం. అయితే ఇది కాలేయ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే రసాయనం కాలేయం కణాల డ్యామేజ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లి కూడా కాలేయానికి చాలా మంచిది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే రసాయనం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయ కణాలను డ్యామేజ్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
పచ్చి ఆకుకూరలు:
పచ్చి ఆకుకూరలు కాలేయానికి చాలా మంచివి. వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు రోజూ ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి.
అవకాడో:
అవకాడోలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా ఇవి అవకాడోలో విటమిన్ ఇ, గ్లూటాతియోన్ అనే రసాయనాలు కాలేయ కణాల డ్యామేజ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ కాలేయానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కాలేయ వాపును తగ్గిస్తాయి. అలాగే.. ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలను డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి.
Also Read: వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి !
నట్స్, సీడ్స్:
నట్స్, సీడ్స్ కూడా కాలేయానికి చాలా మంచివి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
టమాటోలు:
టమాటోలు కాలేయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. టమాటోల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లివర్ కణాలను డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. టమాటోలు తినడం వల్ల కాలేయానికి సంబంధించిన క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రోజూ వీటిని సరైన మోతాదులో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వీటితో పాటు మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరం. కాలేయ ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్‌లను సంప్రదించడం మంచిది.