E-Paper
Advertisement

లవ్ ఫెయిల్యూర్‌పై.. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ఎమోషనల్ కామెంట్స్!

లవ్ ఫెయిల్యూర్‌పై.. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Kalyan Padala: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఘన విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించిన కళ్యాణ్ పడాల, తాజాగా బిగ్ టీవీ ప్లస్ సమర్పించు ‘కిస్సిక్ టాక్స్’ (Kissik Talks) షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హౌస్ లోపల అనుభవాలు, బయట లభిస్తున్న అపూర్వమైన ఆదరణతో పాటు తన వ్యక్తిగత జీవితంలోని ఆనందాలు, కష్టాలను ఈ ఇంటర్వ్యూలో కళ్యాణ్ ముక్కుసూటిగా పంచుకున్నారు.

Read also-‘దాని వెనుక ఎన్నో అవమానాలు’.. పవన్ విజయంపై సతీమణి అన్నా ఎమోషనల్ పోస్ట్!

తెలుగు ప్రేక్షకుల అపారమైన ప్రేమ

Advertisement

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేటప్పుడు ఆటపై నమ్మకం ఉన్నప్పటికీ, ఇంతటి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. “మా తెలుగు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలుసా.. ఒక్కసారి గుండెల్లోకి తీసుకుంటే ఇక అస్సలు వదలరు” అని తెలుగు ప్రేక్షకుల అభిమానానికి దాసోహమన్నారు. తాను హిందీ వాడైనప్పటికీ, తెలుగు ప్రేక్షకులు చూపించిన ఈ ప్రేమను ఎప్పటికీ మరువలేనని చెప్పారు. గ్రాండ్ ఫినాలేలో విజేతగా తన పేరు అనౌన్స్ చేసిన క్షణంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కింద పడిపోయానని ఆ మధుర జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు.

తనుజాతో స్నేహం.. హౌస్ వెలుపల బాండింగ్

బిగ్ బాస్ హౌస్ లోపల ఉండే బంధాలు కేవలం ఆట కోసమేనా అనే ప్రశ్నకు కళ్యాణ్ సమాధానమిస్తూ, కొన్ని రిలేషన్స్ చాలా యదార్థమైనవని స్పష్టం చేశారు. తనకు హౌస్‌లో అత్యంత ఇష్టమైన కంటెస్టెంట్ తనుజా అని చెప్తూ, తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహమని పేర్కొన్నారు. ఫ్యామిలీ వీక్‌లో కళ్యాణ్ తల్లి హౌస్‌లోకి వచ్చినప్పుడు తనుజా ఆమెకు ఒక చీరను గిఫ్ట్‌గా ఇచ్చిందని, ఆ సంఘటన చూసి తాను ఎంతో షాక్ అయ్యానని తెలిపారు. ఇప్పటికీ తాను ఎక్కడికైనా వెళ్తుంటే తనుజా ఎంతో జాగ్రత్తగా ఉండమని ఒక స్నేహితురాలిగా వార్నింగ్ ఇస్తుంటుందని నవ్వుతూ చెప్పారు.

తండ్రే నా హీరో

Advertisement

తన కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ కళ్యాణ్ కళ్లెంబడి నీళ్లు తెచ్చుకున్నారు. ఒకప్పుడు పది మందికి పెట్టే స్థాయి నుండి, వ్యాపారంలో వచ్చిన ఆకస్మిక నష్టాల వల్ల తన తండ్రి సర్వస్వం కోల్పోయారని చెప్పారు. ఒకే నెలలో వ్యాపారం కంప్లీట్ జీరో అయిపోవడం, ఆ తర్వాత తండ్రి ఆరోగ్యం క్షీణించడం, కుటుంబంపై అప్పుల భారం పడటం వంటి కఠినమైన రోజులను గుర్తుచేసుకున్నారు. అంతటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా, అప్పులన్నీ క్లియర్ చేస్తూ తనను, తన తమ్ముడిని చదివించారని, అందుకే తన తండ్రే తన లైఫ్ హీరో అని గర్వంగా ప్రకటించారు.

Read also-‘Mega 158’ క్రేజీ అప్‌డేట్.. పొల్లాచిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిరు-బాబీ చిత్రం

ప్రేమ విఫలమైతే..

ఈ రోజుల్లో చాలా మంది యువతీ యువకులు ప్రేమలో విఫలమై డిప్రెషన్‌లోకి వెళ్లడం, ఆత్మహత్యలకు పాల్పడటంపై కళ్యాణ్ స్పందించారు. “మనం అనుకున్నట్లు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? నా జీవితంలో కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నేను కూడా ప్రేమ విషయంలో బాధపడ్డాను. ఒకవేళ నేను ఇప్పటికీ అదే బాధలో మునిగిపోయి ఉంటే, ఈ రోజు ఇంత పెద్ద రియాలిటీ షో గెలిచి, మీ ముందు కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు కదా!” అని ప్రశ్నించారు. ప్రతి బ్యాడ్ ఫేజ్ తర్వాత ఖచ్చితంగా ఒక మంచి రోజు వస్తుందనే కాన్ఫిడెన్స్‌తో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Related News

కిరణ్ అబ్బవరం హిట్స్ వెనుక పీఆర్ టీమ్ బలంగా ఉందా?

బన్నీ మూవీలో హీరోయిన్ ఉండదా? మార్క్ చూపించబోతున్న లోకేష్!

హీరో విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ?

ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా?.. కృతి సనన్ -కబీర్ ఫోటో వైరల్

హీరో జయంరవికి కోర్టులో ఊరట.. భార్యకి షాక్!

“జబర్దస్త్‌కి అప్పటి క్రేజ్ లేదు.. అసలు కారణం ఇదే!”

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

షూటింగ్లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్.. స్పందిస్తున్న సెలబ్రిటీస్!

Big Stories

Advertisement
×