E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఆమె నా పెదవులు కొరకలేదు బాబోయ్ .. అంటున్న బాలీవుడ్ స్టార్ !

ఆమె నా పెదవులు కొరకలేదు బాబోయ్ .. అంటున్న బాలీవుడ్ స్టార్ !
Advertisement

Kangana Rumor: ఇదసలె సోషల్ మీడియా జమానా..దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమనే రకాలు. అలాంటి ఈ డిజిటల్ ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. అలాంటిది కాంట్రవర్సీలకి కేరాఫ్ గా పిల్చుకునే కంగనా పేరు వార్తల్లో వినిపిస్తే ఆ వార్త సెకన్ లో వైరల్ అవడం ఖాయం. ఇదిగో తాజాగా కంగనాపై అలాంటి ఓ క్రేజీ పాతబడ్డ రూమరే ఇపుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కడం, దానిపై తెగ డిబేట్లు నడవడం ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.

2014 ఏప్రిల్ 25న విడుదలైన రివాల్వర్ రాణి

మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే ‘అది రివాల్వర్ రాణి’ సినిమా.సాయి కబీర్ దర్శకత్వంలో 2014 ఏప్రిల్ 25న విడుదలైన ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు కంగనా రనౌత్,ప్రముఖ యాక్టర్ కమ్ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్.అయితే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డా కంగనా క్యారెక్టర్ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అయితే రిలీజ్ అయి దాదాపు 12 ఏళ్ళకి ఈ సినిమా సెట్స్ లో జరిగిన ఒక క్రేజీ ఇన్సిడెంట్ గురించి ఒక గాసిప్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

also read:గ్లామర్ క్వీన్ వెనుక కన్నీటి సముద్రం.. సావిత్రి కంటే ముందే ఆ స్టార్ హీరోతో సీక్రెట్ లైఫ్!

కంగనా పాత్రలో లీనం అయిపోయి వీర్ పెదవిని 

అదేంటంటే ఆ సినిమా సెట్స్ లో కంగనా, వీర్ ల మధ్య ఒక కిస్ సీన్ షూట్ చేశారని, ఆ సీన్ చేసేటప్పుడు కంగనా పాత్రలో లీనం అయిపోయి వీర్ పెదవిని కొరికిందని.ఇదంతా తాజాగా ఒక రిపోర్టర్ బయటపెట్టడంతో ఒక్కసారిగా మీడియాలో తెగ వైరల్ అయిపొయింది.పైగా కంగనా రౌడీ క్యారెక్టర్‌కు ఈ ఇన్సిడెంట్ సరిగ్గా సరిపోయిందంటూ కొందరు కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టారు కూడా.

Advertisement

అయితే అది తెగ వైరల్ అవుతుండటంతో ఎట్టకేలకి రియాక్ట్ అయ్యాడు యాక్టర్ కమ్ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్. అసలు కంగనా నా పెదవుల్ని కొరకలేదు మొర్రో అంటూ సంజాయిషీ ఇచ్చుకునే పనిలో పడ్డాడు.ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని,కంగనా ఒక పక్కా ప్రొఫెషనల్ యాక్టర్ అని చెప్పుకొచ్చాడు .ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేశాడు.

సొసైటీలో పాగా వేసిన సోషల్ మీడియా 

ప్రస్తుతం కంగనా రనౌత్ పొలిటికల్ కెరీర్‌తో పాటు సర్కిల్ ,క్వీన్ 2 సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ‘రివాల్వర్ రాణి’ నాటి పాత గాసిప్ తెరపైకి రావడం కాస్త ఆశ్చర్యపరిచినప్పటికీ, వీర్ దాస్ టైమ్‌కి స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్ కి బ్రేక్ పడినట్టే కనిపిస్తుంది.ఏది ఏమైనా అప్పుడెప్పుడో పదేళ్ళ కిందటి వార్త ఇప్పుడు మళ్ళీ వైరల్ అయిందంటే సోషల్ మీడియా సొసైటీలో ఎంతగా పాగా వేసిందో అర్థం అవుతుంది.

also read:టాలీవుడ్‌లో రూ.1300 కోట్ల జూదం.. ఆ ఆరు సినిమాలు తేడా కొడితే అంతే సంగతులా?

Related News

‘వారణాసి’ సీక్వెల్‌పై రాజమౌళి క్లియర్ కట్ స్టేట్‌మెంట్…క్లారిటీ వచ్చేసిందిగా !

గ్లామర్ క్వీన్ వెనుక కన్నీటి సముద్రం.. సావిత్రి కంటే ముందే ఆ స్టార్ హీరోతో సీక్రెట్ లైఫ్!

టాలీవుడ్‌లో రూ.1100 కోట్ల జూదం.. ఆ ఆరు సినిమాలు తేడా కొడితే అంతే సంగతులా?

కయాదు లోహర్‌తో సూర్య రొమాన్స్….డైరెక్టర్ ఎవరో తెలుసా ?

యూట్యూబ్‌ ని షేక్ చేస్తున్న తెలుగు సాంగ్స్ ఇవే….అగ్ర స్థానం ఆహీరోదే !

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో షురూ.. ‘శివుని త్రిశూలం… డీఎన్‌ఏ రూపం’.. ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పీక్స్‌!

జాన్వీ కపూర్ దక్షిణాదిలోనే స్థిరపడనుందా.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!

Big Stories

×